అంకురాలకు పెట్టుబడుల వెల్లువ
close

Published : 26/10/2021 04:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంకురాలకు పెట్టుబడుల వెల్లువ

దిల్లీ: అంకుర సంస్థలు తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా పెట్టుబడి సంస్థలు/వెంచర్‌ క్యాపటలిస్ట్‌ల నుంచి భారీగా నిధులు సమీకరిస్తున్నాయి. డిజిటల్‌ సంస్థ గ్రో 251 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1,885 కోట్లు) పెట్టుబడులు సమీకరించింది. కంపెనీ విలువను 300 కోట్ల డాలర్లుగా లెక్కించి ఐకానిక్‌ గ్రోత్‌ ప్రధానంగా పెట్టుబడి పెట్టింది. సిరీస్‌ ఇ ఫండింగ్‌లో భాగంగా ఆల్కియాన్‌, లోన్‌ పైన్‌ క్యాపిటల్‌, స్టెడ్‌ ఫాస్ట్‌ తదితర పెట్టుబడి సంస్థలు సహా ఇప్పటికే ఈ కంపెనీలో పెట్టుబడిదార్లుగా కొనసాగుతున్న సిఖోయా క్యాపిటల్‌, రిబిట్‌ క్యాపిటల్‌, వైసీ కంటిన్యుటీ, టైగర్‌ గ్లోబల్‌, ప్రొపెల్‌ వెంచర్‌ కూడా నిధులు చొప్పించాయి.

టెక్‌ ఆధారిత ఇంట్రా-సిటీ లాజిస్టిక్స్‌ కంపెనీ పోర్టర్‌ టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌, వట్రువియాన్‌ పార్ట్‌నర్స్‌ నుంచి ఇ-సిరీస్‌ ఫండింగ్‌లో భాగంగా రూ.750 కోట్ల నిధుల్ని సమీకరించింది. ప్రస్తుతం కంపెనీలో పెట్టుబడిదార్లుగా కొనసాగుతున్న సిఖోయా క్యాపిటల్‌ ఇండియా, లైట్‌రాక్‌ ఇండియాలు కూడా నిధులు చొప్పించాయి.

టీచ్‌మింట్‌ సంస్థ సిరీస్‌-బి ఫండింగ్‌లో భాగంగా 78 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.585 కోట్లు) సమీకరించింది. రాకెట్‌షిప్‌, వల్కన్‌ క్యాపిటల్‌లు సంస్థ విలువను 500 మిలియన్‌ డాలర్లుగా లెక్కించి ఈ పెట్టుబడులు పెట్టాయి. గుడ్‌వాటర్‌ క్యాపిటల్‌, ఎపిక్‌ క్యాపిటల్‌ కూడా ఈ సిరీస్‌లో పెట్టుబడులు చొప్పించాయి.

సరఫరా చైన్‌ అంకురం ఓ4ఎస్‌ సిరీస్‌ ఎ-ఫండింగ్‌లో భాగంగా థింక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, వెంచర్‌ హైవేల నుంచి 6 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.45 కోట్లు) నిధుల్ని సమీకరించింది.

ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నుంచి డెట్‌ ఫండ్‌ రూపంలో 14 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.100 కోట్లు) నిధుల్ని ఫిన్‌టెక్‌ సంస్థ భారత్‌ పే సమీకరించింది. ఈ క్యాలెండర్‌ ఏడాదిలో ఇప్పటి వరకు 8 విడతల్లో 84 మిలియన్‌ డాలర్ల డెట్‌ ఫండ్‌ను సమీకరించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని