సౌర విద్యుత్‌ టారిఫ్‌లు పెరగొచ్చు
close

Published : 27/10/2021 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సౌర విద్యుత్‌ టారిఫ్‌లు పెరగొచ్చు

 యూనిట్‌కు 20-25 పైసల మేర: ఇక్రా

దిల్లీ: సౌర విద్యుత్‌ టారిఫ్‌లు గత 6 నెలలతో పోలిస్తే కొత్త ప్రాజెక్టుల బిడ్లలో యూనిట్‌కు 20-25 పైసల మేర పెరిగే అవకాశం ఉందని పునరుత్పాదక ఇంధనంపై వెల్లడించిన నివేదికలో ఇక్రా తెలిపింది. 2030 నాటికి భారత్‌ 450 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ‘సౌర మాడ్యుల్‌ ధరలు పెరగడం, సౌర విద్యుత్‌ పరికరాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పెంచడం తదితర కారణాలతో రాబోయే సౌర ప్రాజెక్టుల బిడ్లలో 20-25 పైసల మేర టారిఫ్‌లు పెంచొచ్చ’ని నివేదిక తెలిపింది. అయితే పోటీకి అనుగుణంగా యూనిట్‌ టారిఫ్‌ రూ.3 లోపే ఉండొచ్చని పేర్కొంది.


మూరత్‌ ట్రేడింగ్‌ రోజున బ్రోకరేజీ రుసుముల్లేవ్‌: జెరోధా

దిల్లీ: దీపావళి రోజు (నవంబరు 4న) స్టాక్‌ ఎక్స్చేంజీలు ప్రత్యేకంగా నిర్వహించే మూరత్‌ ట్రేడింగ్‌లో షేర్ల క్రయవిక్రయ లావాదేవీలకు బ్రోకరేజీ రుసుమును రద్దు చేస్తున్నట్లు జెరోధా తెలిపింది. అన్ని తరహా ట్రేడ్‌లకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. మూరత్‌ ట్రేడింగ్‌ 4వ తేదీ సాయంత్రం గం.6:15కు ప్రారంభమై గం.7:15కి ముగుస్తుంది. ‘గత 11 ఏళ్లుగా కొనసాగిస్తున్న సంప్రదాయానికి అనుగుణంగా ఈసారి కూడా మూరత్‌ ట్రేడింగ్‌లో అన్ని ట్రేడ్‌ల బ్రోకరేజీ రుసుములను రద్దు చేస్తున్నాం. ఇంట్రాడే, ఎఫ్‌అండ్‌ఓ, కమొడిటీ ట్రేడ్‌లకు బ్రోకరేజీ రుసుము సున్నా’ అని జెరోధా ఓ ప్రకటనలో తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని