గృహ రుణాల జారీకి ఐపీపీబీతో హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యం
close

Published : 27/10/2021 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గృహ రుణాల జారీకి ఐపీపీబీతో హెచ్‌డీఎఫ్‌సీ భాగస్వామ్యం

దిల్లీ: గృహ రుణాలు అందించే తనఖా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌తో (ఐపీపీబీ) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఉన్న సుమారు 4.7 కోట్ల మంది ఖాతాదార్లలో అవసరమైన వారికి గృహ రుణాలను అందించనుంది. దేశ వ్యాప్తంగా ఐపీపీబీకి ఉన్న 650 శాఖలు, 1,36,000 పోస్టాఫీసుల (బ్యాంకింగ్‌ యాక్సెస్‌ పాయింట్లు) ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణ ఉత్పత్తులు, ఆ సంస్థకు ఈ రంగంలో ఉన్న అనుభవం గురించి సమాచారం లభిస్తుంది. ఐపీపీబీ, హెచ్‌డీఎఫ్‌సీలు సోమవారం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయని ఐపీపీబీ ఎండీ జె.వెంకట్రాము, హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ రేణు సుద్‌ కర్నాడ్‌ వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని