నగదు బదిలీ ఉచితంగానే: ఫోన్‌పే
close

Published : 27/10/2021 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నగదు బదిలీ ఉచితంగానే: ఫోన్‌పే

ఈనాడు, హైదరాబాద్‌: యూపీఐ ద్వారా నగదు బదిలీ, చెల్లింపులు చేసినప్పుడు ఎలాంటి రుసుములూ వసూలు చేయడం లేదని డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే వెల్లడించింది. భవిష్యత్తులోనూ వసూలు చేయబోమని స్పష్టం చేసింది. ఇటీవల మొబైల్‌ ఫోన్‌ రీఛార్జీల మీద రుసుములు విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, యూపీఐ లావాదేవీలపైనా రుసుము విధిస్తున్నారనే వార్తలకు ఫోన్‌పే ఇలా స్పందించింది. రూ.50 లోపు మొబైల్‌ రీఛార్జీలకు కూడా ఎలాంటి రుసుములూ లేవని తెలిపింది. క్రెడిట్‌ కార్డులతో చేసే బిల్లుల చెల్లింపులకు రుసుము ఉంటుందని, ఇప్పుడు పరిశ్రమలో అమలు చేస్తున్నదేనని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని