కోటక్‌ మహీంద్రా ఏఎంసీకి ఊరట
close

Published : 27/10/2021 02:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోటక్‌ మహీంద్రా ఏఎంసీకి ఊరట

సెబీ ఆదేశాల్లో కొన్నింటిపై శాట్‌ స్టే

దిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్‌ హోల్డర్ల నుంచి పెట్టుబడులు నిర్వహణ, సలహాల రుసుం కింద వసూలు చేసిన డబ్బుల్లో కొంత వెనక్కి ఇవ్వాలంటూ కోటక్‌ మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ)కి సెబీ ఇచ్చిన ఆదేశాలపై సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) స్టే విధించింది. వడ్డీ జమ ఖాతాలో రూ.20 లక్షలను నాలుగు రోజుల్లోగా డిపాజిట్‌ చేయాలని కంపెనీకి సూచించింది. ఆరు ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎమ్‌పీ) పథకాలకు సంబంధించి వార్షికంగా 15 శాతం వడ్డీని పెట్టుబడుల నిర్వహణ, సలహాల రుసుం కింద యూనిట్‌ హోల్డర్ల నుంచి కోటక్‌ మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ వసూలు చేసింది. ఇందులో కొంత మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని కంపెనీకి ఆగస్టులో సెబీ ఆదేశాలు ఇచ్చింది. రూ.50 లక్షల జరిమానాను విధించడమే కాకుండా.. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆరు నెలల పాటు ఎలాంటి కొత్త పథకాన్ని విడుదల చేయొద్దని కూడా ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ శాట్‌ను కోటక్‌ మహీంద్రా ఏఎంసీ ఆశ్రయించింది. దీంతో సెబీ ఆదేశాలను ప్రస్తుతానికి శాట్‌ పక్కకుపెట్టింది. అయితే రూ.50 లక్షల జరిమానా, ఆరు నెలల పాటు కొత్త పథకాల విడుదలపై నిషేధం ఆదేశాలకు మాత్రం స్టేని శాట్‌ వర్తింపజేయలేదు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని