39 శాతం పెరిగిన శామ్‌సంగ్‌ ఇండియా లాభం
close

Published : 27/10/2021 02:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

39 శాతం పెరిగిన శామ్‌సంగ్‌ ఇండియా లాభం

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో శామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ నికర లాభం రూ.4040.9 కోట్లుగా నమోదైంది. 2019-20లో కంపెనీ ఆర్జించిన రూ.2,902.6 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 39 శాతం అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.75,461.5 కోట్ల నుంచి రూ.75,886.3 కోట్లకు చేరింది. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు శామ్‌సంగ్‌ సమర్పించిన ఫలితాల ప్రకారం.. మొత్తం ఆదాయం రూ.78,651.2 కోట్ల నుంచి 1.46 శాతం తగ్గి రూ.77,501.5 కోట్లకు పరిమితమైంది. ఈ ఫలితాలను మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ టోఫ్లెర్‌ వెల్లడించింది. ఈ ఫలితాలపై శామ్‌సంగ్‌ ఇండియా స్పందించలేదు. 2020-21లో కంపెనీ మొత్తం వ్యయాలు రూ.74,413.4 కోట్ల నుంచి రూ.71,898.7 కోట్లకు తగ్గాయి. ఉద్యోగుల ప్రయోజనాల వ్యయాలు రూ.2,702.2 కోట్ల నుంచి రూ.2,687.4 కోట్లకు చేరాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని