ఎలాన్‌ మస్క్‌ ఆదాయం.. సెకనుకు ఎంతో తెలుసా?
close

Updated : 27/10/2021 07:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎలాన్‌ మస్క్‌ ఆదాయం.. సెకనుకు ఎంతో తెలుసా?

ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌ మరో ఘనత సాధించారు. అత్యంత విలువైన కంపెనీ అయిన ఎక్సాన్‌ మొబిల్‌ కార్ప్‌ కంటే, ఎలాన్‌ మస్క్‌ నికర విలువ అధికమైందని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తెలిపింది. సోమవారం ఎలాన్‌ మస్క్‌ సంపద విలువ 288.6 బిలియన్‌ డాలర్ల (రూ.21.64 లక్షల కోట్ల)కు చేరుకుంది. హెర్ట్జ్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఏకంగా లక్ష టెస్లా కార్లకు ఆర్డరు పెట్టిన నేపథ్యంలో టెస్లా షేరు అధిక లాభాలనివ్వడంతో, ఒక రోజులోనే ఆయన సంపద విలువ 36.2 బిలియన్‌ డాలర్ల (రూ.2.71 లక్షల కోట్లు) మేర పెరిగింది. అంటే సెకనుకు రూ.3 కోట్లకు పైగా ఆర్జించారన్నమాట. ఈ ఏడాది ప్రారంభంలోనూ మస్క్‌ నికర విలువ, ఎక్సాన్‌ మొబిల్‌ను అధిగమించినప్పటికీ, తదుపరి చమురు ధరల పెరుగుదల కారణంగా ఆ కంపెనీ విలువే అధికమైంది. విచిత్రం ఏమిటంటే.. చమురు ధరలు ఎంత పెరిగితే, ప్రత్యామ్నాయంగా కనపడుతున్న విద్యుత్‌కార్లు అంతగా అమ్ముడుపోతాయి. అపుడు మస్క్‌ సంపదా పెరుగుతుంది. 

లక్ష కోట్ల డాలర్ల కంపెనీగా టెస్లా: మస్క్‌తో పాటు టెస్లా కూడా సోమవారం మరో రికార్డు సృష్టించింది. తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను చేరింది. కంపెనీ షేరు విలువ 1024.86 డాలర్లకు చేరడంతో నాస్‌డాక్‌లో ట్రేడింగ్‌ ముగింపు నాటికి సంస్థ విలువ 1.02 లక్షల కోట్ల డాలర్ల (రూ.75 లక్షల కోట్లకు పైగా)కు దూసుకెళ్లింది. ఈ ఏడాది మే చివరి నుంచి ఇప్పటిదాకా టెస్లా షేరు 64% మేర లాభపడింది. లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో ఇప్పటికే యాపిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, సౌదీఅరామ్‌కో, ఆల్ఫాబెట్‌లున్న విషయం తెలిసిందే. టెస్లాలో మస్క్‌కు 23% వాటా ఉంది. బీఎస్‌ఈలో అగ్రగామి అయిదు కంపెనీల మార్కెట్‌ విలువను కలిపినా అది రూ.51.67 లక్షల కోట్లు లేదా 688 బి.డాలర్లుగానే ఉంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని