ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూ 29 నుంచి
close

Published : 27/10/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూ 29 నుంచి

 ధరల శ్రేణి రూ.560- 577

రూ.1,200 కోట్ల సమీకరణ లక్ష్యం

దిల్లీ: ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూ అక్టోబరు 29న ప్రారంభమై నవంబరు 2న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.560- 577ను కంపెనీ నిర్ణయించింది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.1,200 కోట్లు సమీకరించాలన్నది సంస్థ ప్రణాళిక. స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదుకానున్న మొదటి చెల్లింపుల బ్యాంకు ఫినో పేమెంట్స్‌ బ్యాంకే కావడం గమనార్హం. ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రస్తుత పెట్టుబడిదార్లకు చెందిన 1.5 కోట్ల వర్లకు షేర్లను సంస్థ విక్రయించనున్నటు తెలుస్తోంది. 

1 నుంచి పాలసీబజార్‌ ఇష్యూ: ఆన్‌లైన్‌ బీమా అగ్రిగేటర్‌ పాలసీబజార్‌ను నిర్వహించే పీబీ ఫిన్‌టెక్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) నవంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిని రూ.940-980గా నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా రూ.2 ముఖవిలువ కలిగిన 6,07,30,265 షేర్లను కంపెనీ జారీ చేయనుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.5709.72 కోట్లు సమీకరించాలని చూస్తోంది. తాజాగా రూ.3750 కోట్ల విలువైన షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదార్లు రూ.1959.72 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని