యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.3,383 కోట్లు
close

Published : 27/10/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.3,383 కోట్లు

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికానికి యాక్సిస్‌ బ్యాంక్‌ ఏకీకృత పద్ధతిలో రూ.3,382.78 కోట్ల నికర లాభాన్ని , స్టాండలోన్‌ పద్ధతిలో రూ.3,133.22 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. ఒక త్రైమాసికంలో యాక్సిస్‌ బ్యాంక్‌కు ఇదే అత్యధిక లాభం. మొండి బకాయిలు, వాటికి కేటాయింపులు తగ్గడం ఇందుకు తోడ్పడింది. కొత్త మొండి బకాయిలు తగ్గడంతో స్థూల నిరర్థక ఆస్తులు 4.18 శాతం నుంచి తగ్గి 3.53 శాతానికి పరిమితమయ్యాయి. దీంతో మొండి బకాయిలు, ఇతరత్రా అవసరాలకు కేటాయింపులు రూ.4,343 కోట్ల నుంచి గణనీయంగా తగ్గి రూ.1,735 కోట్లుగా నమోదయ్యాయి. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ.7,900 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.39 శాతంగా ఉంది. వడ్డీయేతర ఆదాయంలో 6 శాతం వృద్ధితో రూ.3,798 కోట్లుగా నమోదైంది.

కోటక్‌ బ్యాంక్‌: కోటక్‌ బ్యాంక్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,032 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభం రూ.2,184 కోట్లతో పోలిస్తే ఇది 7% తక్కువ. మొత్తం ఆదాయం రూ.8,252.71 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.8,408.87 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,897 కోట్ల నుంచి రూ.4,021 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 4.45 శాతంగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2.55 శాతం నుంచి 3.19 శాతానికి; నికర ఎన్‌పీఏలు 0.64 శాతం నుంచి 1.06 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.333.22 కోట్ల నుంచి  రూ.423.99 కోట్లకు చేరాయి. ఏకీకృత ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం రూ.2,947 కోట్ల నుంచి రూ.2,989 కోట్లకు స్వల్పంగా పెరిగింది. మొత్తం ఆదాయం రూ.13,548.33 కోట్ల నుంచి రూ.15,341.65 కోట్లకు చేరింది.

కెనరా బ్యాంక్‌: కెనరా బ్యాంక్‌ జులై- సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,332.61 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నమోదు చేసిన రూ.444.41 కోట్ల లాభంతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు. మొత్తం ఆదాయం రూ.20,793.92 కోట్ల నుంచి రూ.21,331.49 కోట్లకు చేరింది. స్థూల ఎన్‌పీఏలు 8.23 శాతం (రూ.53,437.92 కోట్లు) నుంచి 8.42 శాతానికి (రూ.57,853.09 కోట్లు) చేరాయి. నికర ఎన్‌పీఏలు 3.42% (రూ.21,063.28 కోట్లు) నుంచి 3.21 శాతానికి (రూ.20,861.99 కోట్లు) తగ్గాయి. కేటాయింపులు రూ.3,974.02 కోట్ల నుంచి రూ.3,360.23 కోట్లకు పరిమతమయ్యాయి. ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.465.88 కోట్ల నుంచి రూ.1,100.59 కోట్లకు చేరింది. ఆదాయం రూ.22,638.26 కోట్ల నుంచి రూ.23,876 కోట్లకు చేరింది.

సిప్లా: జులై- సెప్టెంబరు త్రైమాసికానికి సిప్లా రూ.711 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.665 కోట్లతో పోలిస్తే ఇది 7% ఎక్కువ. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5,038 కోట్ల నుంచి రూ.5520 కోట్లకు పెరిగింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 16 శాతం వృద్ధితో రూ.2,416 కోట్లకు, అమెరికా ఆదాయాలు 2% పెరిగి రూ.1055 కోట్లకు చేరాయి. బ్రాండెడ్‌ మార్కెట్లలో బలమైన వృద్ధి, వ్యయ నియంత్రణ చర్యలతో ఆదాయం 10%, ఎబిటా మార్జిన్‌ 22.2% పెరిగాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని