బీపీసీఎల్‌ నుంచి ప్రభుత్వానికి రూ.6,665 కోట్ల తుది డివిడెండ్‌
close

Published : 28/10/2021 02:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీపీసీఎల్‌ నుంచి ప్రభుత్వానికి రూ.6,665 కోట్ల తుది డివిడెండ్‌

దిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తుది డివిడెండ్‌ రూ.6,665 కోట్లను భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) నుంచి అందుకున్నామని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు. నుమాలీగఢ్‌ రిఫైనరీలో బీపీసీఎల్‌కున్న 61.5 శాతం వాటాను రూ.9,876 కోట్లకు విక్రయించడంతో అందుకున్న లాభాల నేపథ్యంలో ప్రకటించిన ప్రత్యేక డివిడెండ్‌ కూడా ఇందులోనే ఉందని ఆయన తెలిపారు. ఆయిల్‌ ఇండియా, ఇంజినీర్స్‌ ఇండియా, అసోం ప్రభుత్వంతో కలిసి కన్సార్షియంగా ఏర్పడి బీపీసీఎల్‌ ఈ రిఫైనరీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే, బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటా విక్రయానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. వేదాంతా గ్రూప్‌ సహా అపోలో గ్లోబల్‌, ఐ స్క్వేర్డ్‌ క్యాపిటల్‌కు చెందిన ఇండియా యూనిట్‌ థింక్‌ గ్యాస్‌లు ప్రభుత్వ వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) తెలియజేశాయి.


స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌లో 26% వాటా కొనుగోలుకు రూ.1,840 కోట్లు
రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌

దిల్లీ: స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌లో 4.91 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఒక్కో షేరుకు రూ.375 ధరను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ న్యూ ఎనర్జీ సోలార్‌ (ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌) ఆఫర్‌ చేసింది. ఈ లావాదేవీ విలువ రూ.1,840 కోట్లకు పైమాటే. ఈ షేర్లు కంపెనీలో 25.9 శాతం ఈక్విటీ వాటాకు సమానమని స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఓపెన్‌ ఆఫర్‌ ముసాయిదా లేఖలో ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌ సహా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), రిలయన్స్‌ వెంచర్స్‌లు పీఏసీలుగా (పర్సన్స్‌ యాక్టింగ్‌ ఇన్‌ కన్సర్ట్‌) ఉంటాయని పేర్కొంది. పబ్లిక్‌ షేర్‌ హోల్డర్ల నుంచి ఆర్‌ఐఎల్‌ (పీఏసీ 1), రిలయన్స్‌ వెంచర్స్‌ (పీఏసీ 2) సంస్థలతో కలిసి ఆర్‌ఎన్‌ఈఎస్‌ఎల్‌ వాటాలు కొనుగోలు చేయనుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని