పేటీఎం ఇన్సూర్‌టెక్‌లో స్విస్‌ ఆర్‌ఈకి 23 శాతం వాటా
close

Published : 28/10/2021 02:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేటీఎం ఇన్సూర్‌టెక్‌లో స్విస్‌ ఆర్‌ఈకి 23 శాతం వాటా

దిల్లీ: పేటీఎం ఇన్సూర్‌టెక్‌లో 23 శాతం వాటాను స్విట్జర్లాండ్‌ రీఇన్సూరెన్స్‌ దిగ్గజం స్విస్‌ ఆర్‌ఈ రూ.920 కోట్లకు కొనుగోలు చేసినట్లు డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎం వెల్లడించింది. పేటీఎం బీమా విభాగంగా పేటీఎం ఇన్సూర్‌టెక్‌ పనిచేస్తోంది. వినూత్న బీమా ఉత్పత్తుల అభివృద్ధికికి పేటీఎం ఖాతాదారులు, మర్చంట్‌ వ్యవస్థల వినియోగానికి సంస్థ ప్రణాళికలు వేస్తోంది. పేటీఎం ఇన్సూర్‌టెక్‌లో పెట్టుబడులతో స్విస్‌ ఆర్‌, పేటీఎంలు మార్కెట్‌లో బీమా రక్షణ లోటును తగ్గించేందుకు పనిచేయనున్నాయి. ఇటీవల రహేజా క్యూబీఈని పేటీఎం ఇన్సూర్‌టెక్‌ కొనుగోలు చేశాక ఈ పెట్టుబడులు వచ్చాయి.


సైయెంట్‌ నుంచి ‘మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌’ సేవలు  

ఈనాడు, హైదరాబాద్‌: సైయెంట్‌ లిమిటెడ్‌ ‘మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌’ సేవల విభాగంలోకి అడుగుపెట్టింది. ‘సైయెంట్‌ కన్సల్టింగ్‌’ పేరుతో ఈ సేవలు అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2025 నాటికి మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సేవల మార్కెట్‌ 1.2 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.90 లక్షల కోట్లకు) విస్తరిస్తుందని అంచనా. ఇంతకాలం తమ ఖాతాదార్లకు ఇంజినీరింగ్‌ సేవలు అందిస్తూ వచ్చామని, ఈ అనుభవంతో మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సేవలూ అందించనున్నామని సైయెంట్‌ ఎండీ కృష్ణ బొదనపు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని