సూక్ష్మ రుణ సంస్థలు
close

Published : 28/10/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూక్ష్మ రుణ సంస్థలు

అధిక లాభాల కోసం చూడకూడదు
వినియోగదార్ల సంక్షేమమే ముఖ్యం
ఆర్‌బీఐ డీజీ రాజేశ్వర్‌ రావు

ముంబయి: సూక్ష్మరుణ(ఎమ్‌ఎఫ్‌ఐ) రంగంలో వృద్ధిని ఆర్‌బీఐ వేగవంతం చేస్తుందని.. అయితే అధిక ఆస్తుల వృద్ధి, లాభాల కోసం ఆ రంగ సంస్థలు ప్రయత్నించకూడదని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌(డీజీ) ఎం. రాజేశ్వర రావు హితవు పలికారు. బ్యాంకుల వ్యూహాలనే ఎమ్‌ఎఫ్‌ఐలు అనుసరించరాదని.. తమ రుణ కార్యకలాపాల వల్ల సామాజిక లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ‘అధిక ఆస్తుల వృద్ధి, ప్రతిఫలాల కోసం ఎమ్‌ఎఫ్‌ఐలు పరుగులు తీయకూడదు. ఎమ్‌ఎఫ్‌ఐలు చేపట్టే ఏదైనా ప్రతికూల చర్య కారణంగా దశాబ్దాల పాటు సాధించిన ప్రగతి వెనక్కి వెళ్లకూడద’ని బుధవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ‘సూక్ష్మ రుణ సంస్థలు తమ మూలాలను మరచిపోకూడదు. స్వయం సమృద్ధి, ఆర్థిక పటుత్వం అనే లక్ష్యాలను రుణదాతలు మరిచిపోకూడదు కానీ.. సామాజిక, సంక్షేమ లక్ష్యాలను పక్కనపెట్టి లాభాలకు ప్రాధాన్యం ఇస్తే అనుకున్న ఫలితాలు రావ’ని ఆయన అన్నారు. వినియోగదార్ల అవసరాలను అర్థం చేసుకుని, సరైన ఆర్థిక ఉత్పత్తుల ద్వారా వారికి మద్దతునివ్వాలని ఆయన నొక్కిచెప్పారు. ‘ఎమ్‌ఎఫ్‌ఐ వినియోగదార్లలో ఆర్థిక స్పృహ తక్కువగా ఉంటుంది. రుణాల కోసం ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి వారిని సానుభూతితో చూడాలి. ఇన్వెస్టర్‌ ప్రెజెంటేషన్లకు డేటా పాయింట్లలాగా వారిని పరిగణించరాద’ని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని