30% తగ్గిన అదానీ పోర్ట్స్‌ లాభం
close

Published : 28/10/2021 03:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

30% తగ్గిన అదానీ పోర్ట్స్‌ లాభం

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.968.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.1,393.69 కోట్లతో పోలిస్తే ఇది 30.51 శాతం తక్కువ. వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.3,423.16 కోట్ల నుంచి రూ.4,066.78 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,622.78 కోట్ల నుంచి రూ.2,509.81 కోట్లకు చేరాయి. 2021-22 ప్రథమార్ధంలో మంచి ఫలితాలు సాధించామని, వృద్ధి ప్రయాణంలో ఇది ఉదాహరణ అని అదానీ పోర్ట్స్‌ సీఈఓ కరణ్‌ అదానీ పేర్కొన్నారు. గంగవరం పోర్ట్‌, సర్గుజా రైల్‌, దిఘి పోర్ట్‌ల కొనుగోళ్లతో పాటు కొలంబోలో కొత్త విమానాశ్రయంతో శ్రీలంకలో అడుగుపెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో అదానీ పోర్ట్స్‌ 144 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరకు రవాణా చేపట్టింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇది 98 ఎంఎంటీగా ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని