సంక్షిప్త వార్తలు
close

Published : 28/10/2021 03:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

రూ.లక్ష కోట్ల ఐటీ రిఫండ్‌ల జారీ: సీబీడీటీ

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి అక్టోబరు 25 మధ్య పన్ను చెల్లింపుదార్లకు రూ.1,02,952 కోట్ల మేర రిఫండ్‌లు జారీ చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది. 77.92 లక్షలకు పైగా పన్ను చెల్లింపుదార్లకు ఈ మొత్తాన్ని జారీ చేశారు. ఇందులో 76,21,956 కేసుల్లో రూ.27,965 కోట్ల వ్యక్తిగత పన్ను రిఫండ్‌లు, 1,70,424 కేసుల్లో రూ.74,987 కోట్ల కార్పొరేట్‌ రిఫండ్‌లు ఉన్నట్లు పేర్కొంది.


ఫండ్‌ కొనుగోళ్లూ తెలిసిపోతాయ్‌
ఆదాయపు పన్ను ఫామ్‌ 26ఏఎస్‌ జాబితా విస్తరణ

దిల్లీ: పన్ను చెల్లింపుదార్లకు అందుబాటులో ఉండే ‘ఫామ్‌ 26ఏఎస్‌’లోని అధిక విలువ ఆర్థిక లావాదేవీల జాబితాను ఆదాయ పన్ను(ఐటీ) విభాగం మరింత విస్తరించింది. మ్యూచువల్‌ ఫండ్‌(ఎమ్‌ఎఫ్‌) కొనుగోళ్లు, విదేశీ చెల్లింపులు (రెమిటెన్స్‌)లనూ జత చేసింది. ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ ద్వారా పన్ను చెల్లింపుదార్లు తమ శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌)ను వినియోగించి ఫామ్‌ 26ఏఎస్‌ను తీసుకోవచ్చు. ఇందులో వార్షిక ఏకీకృత పన్ను స్టేట్‌మెంట్‌ ఉంటుంది.అధీకృత డీలరు ద్వారా ఏ వ్యక్తి అయినా చేసే విదేశీ చెల్లింపులు, ఉద్యోగి క్లెయిము చేసుకున్న మినహాయింపులు, వేతన బ్రేకప్‌, పన్ను చెల్లింపుదార్ల ఐటీఆర్‌లోని సమాచారం, ఆదాయ పన్ను రిఫండ్‌పై వడ్డీ, ఆర్థిక లావాదేవీల పత్రంలో ప్రచురితమయ్యే సమాచారం..ఇవన్నీ అదనపు సమాచారం కింద ఉంటాయి. డిపాజిటరీ/రిజిస్ట్రార్‌లు నమోదు చేసే మార్కెట్‌ వెలుపలి లావాదేవీలు, మ్యూచువల్‌ ఫండ్‌ కొనుగోళ్లు, మ్యూచువల్‌ ఫండ్‌ డివిడెండ్‌లు కూడా అందులో ఉంటాయి.


పీఎం ఆర్థిక సలహామండలి పునర్నియామకం

ఈనాడు, దిల్లీ ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి పునర్నియామకం జరిగింది. ప్రధానమంత్రి ఆదేశం మేరకు దీనికి ఛైర్మన్‌గా డాక్టర్‌ బిబేక్‌ డేబ్రాయ్‌ను కొనసాగించనున్నారు. ఇందులో పార్ట్‌టైమ్‌ సభ్యులుగా రాకేష్‌ మోహన్‌, సాజిద్‌ చినాయ్‌, నీలకంఠ మిశ్ర, నిలేష్‌ షా, టీటీ రామ్‌మోహన్‌, పూనం గుప్త నియమితులయ్యారు. ఇందులో సాజిద్‌ చినాయ్‌, నీలకంఠ మిశ్ర, నీలేష్‌షా ఇదివరకూ సభ్యులుగా ఉన్నారు. రాకేష్‌మోహన్‌, టీటీ రామ్‌మోహన్‌, పూనంగుప్త కొత్తగా వచ్చారు. ఈ కౌన్సిల్‌ రెండేళ్లపాటు కొనసాగనుంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని