హైదరాబాద్‌లో ‘అఫైన్‌’ కేంద్రం
close

Updated : 28/10/2021 06:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లో ‘అఫైన్‌’ కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: కృత్రిమ మేధ, డేటా ఇంజనీరింగ్‌ సేవల కన్సల్టింగ్‌ సంస్థ అఫైన్‌, హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ఈ కేంద్రంలో 200 మంది కొత్త ఉద్యోగులను నియమించనున్నట్లు, వచ్చే ఏడాది చివరికి ఉద్యోగుల సంఖ్యను 400 వరకు పెంచుకుంటామని పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ 6 నెలల వ్యవధిలో బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో ఐటీ కన్సల్టింగ్‌ సేవలు అందించాలని భావిస్తోంది. హైదరాబాద్‌ అత్యుత్తమ ఐటీ సేవల కేంద్రంగా ఎదుగుతున్నందున తమ కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పినట్లు అఫైన్‌ సీఈఓ మానస్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇంజినీరింగ్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఉత్పత్తి రంగాలకు సంబంధించి వినూత్న ప్రాజెక్టులపై తమ ఇంజినీర్లు పరిశోధనలు చేస్తారని వివరించారు. అటానమస్‌ డ్రైవింగ్‌, ఆటోమేటెడ్‌ డిఫెక్ట్స్‌ డిటెక్షన్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌, క్వాలిటీ కంట్రోల్‌ సంబంధిత సేవలను అందిస్తున్నట్లు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని