ఐటీసీ లాభం రూ.3764 కోట్లు
close

Published : 28/10/2021 03:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీసీ లాభం రూ.3764 కోట్లు

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికంలో ఐటీసీ ఏకీకృత నికర లాభం 10.09% వృద్ధితో రూ.3,763.73 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.3,418.69 కోట్లు మాత్రమే. కార్యకలాపాల ఆదాయం రూ.13,075.14 కోట్ల నుంచి 12.14% వృద్ధితో రూ.14,662.59 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు కూడా 11.93% పెరిగి రూ.10,258.26 కోట్లుగా నమోదయ్యాయి. కరోనా తీవ్రత తగ్గడం, టీకా వేగం పెరగడంతో సమీక్షిస్తున్న త్రైమాసికంలో వినియోగదారు సెంటిమెంటు, గిరాకీ వాతావరణం మెరుగుపడినట్లు ఐటీసీ తెలిపింది. ముడి పదార్థాల వ్యయాలు పెరగడం; అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, రవాణాలో ఇబ్బందుల వల్ల వ్యయాలు పెరిగాయని వివరించింది. తొలి దశ కరోనాతో పోలిస్తే విక్రయాల పరంగా వేగంగా రికవరీ చెందినట్లు.. ఇపుడు కరోనా ముందు స్థాయిలకు సమీపంలో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఐటీసీకి ప్రధానమైన ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగ వ్యాపారం 7.38% వృద్ధితో రూ.10,263.67 కోట్లకు; సిగరెట్ల వ్యాపారం 10.52% వృద్ధితో రూ.6,219.84 కోట్లకు చేరుకున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని