ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,819 కోట్లు
close

Updated : 28/10/2021 04:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,819 కోట్లు

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికానికి ఎల్‌ అండ్‌ టీ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,819.45 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.5,520.27 కోట్లతో పోలిస్తే ఈసారి 67 శాతం తగ్గింది. అయితే మొత్తం ఆదాయం రూ.31,593.77 కోట్ల నుంచి రూ.35,305.04 కోట్లకు పెరిగింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ష్నైడర్‌కు విద్యుత్‌ వ్యాపారాన్ని విక్రయించడం వల్ల అప్పుడు లాభం అధికంగా నమోదైందని సంస్థ తెలిపింది.ఈసారి అలాంటి లావాదేవీలేవీ లేవ’ని ఎల్‌ అండ్‌టీ పూర్తి కాల డైరెక్టర్‌, ముఖ్య ఆర్థిక అధికారి ఆర్‌.శంకర్‌ రామన్‌ తెలిపారు. సమీక్షా త్రైమాసికంలో కంపెనీకి రూ.42,140 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. కిందటేడాది ఇదే సమయంలో వచ్చిన ఆర్డర్లతో పోలిస్తే ఈ మొతతం 50 శాతం ఎక్కువ. చమురు, గ్యాస్‌, మెట్రో, గ్రామీణ నీటి సరఫరా, ఖనిజాలు, లోహ, ప్రభుత్వ రంగ విభాగాలు, విద్యుత్‌ సరఫరా, పంపిణీ విభాగాల్లో ఈ ఆర్డర్లు వచ్చాయని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ.22,116 కోట్లని, మొత్తం ఆర్డర్ల విలువలో ఇది 52 శాతమని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో నికర లాభం 49 శాతం క్షీణించి రూ.2,994 కోట్లుగా నమోదైంది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని