టైటన్‌ లాభం నాలుగింతలు
close

Updated : 28/10/2021 06:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టైటన్‌ లాభం నాలుగింతలు

దిల్లీ: టాటా గ్రూప్‌ సంస్థ టైటన్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.641 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.173 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు నాలుగింతలు. మొత్తం ఆదాయం రూ.4601 కోట్ల నుంచి రూ.7548 కోట్లకు చేరుకుంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో ఆభరణాల విభాగం అద్భుతంగా రాణించిందని, ఇతర విభాగాలు కొవిడ్‌ ముందు స్థాయిలకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. వ్యాపారాలన్నిటిలోనూ బలమైన గిరాకీ రికవరీ కనిపించిందని ఎండీ సీకే వెంకటాచలం పేర్కొన్నారు. దేశంలోని అన్ని టైటన్‌ స్టోర్లు పూర్తిగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఆభరణాల విభాగంలో ఆదాయం రూ.3446 కోట్ల నుంచి 77% పెరిగి రూ.6106 కోట్లకు చేరుకుందని టైటన్‌ తెలిపింది. వాచీలు, వేరబుల్స్‌ వ్యాపారం 72% వృద్ధి చెంది రూ.687 కోట్లకు; కళ్లద్దాల వ్యాపారం రూ.94 కోట్ల నుంచి 70% పెరిగి రూ.160 కోట్లకు; ఇతర విభాగాల ఆదాయం రూ.23 కోట్ల నుంచి రూ.46 కోట్లకు చేరాయని కంపెనీ వివరించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని