పీఎన్‌బీ లాభంలో 78% వృద్ధి
close

Updated : 28/10/2021 04:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీఎన్‌బీ లాభంలో 78% వృద్ధి

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) నికర లాభం 78 శాతం వృద్ధితో రూ.1,105 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.620.81 కోట్లు మాత్రమే. అయితే  మొత్తం ఆదాయం రూ.23,279.79 కోట్ల నుంచి రూ.21,262.32 కోట్లకు తగ్గింది. బ్యాంకు నిర్వహణ లాభం కూడా రూ.5,674.91 కోట్ల నుంచి రూ.4,021.12 కోట్లకు తగ్గింది. ఆస్తుల నాణ్యత విషయానికొస్తే.. స్థూల నికర నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) 13.43 శాతం నుంచి 13.63 శాతానికి, నికర ఎన్‌పీఏలు సైతం 4.75% నుంచి 5.49 శాతానికి చేరుకున్నాయి. అయితే మొండి బకాయిల కోసం  కేటాయింపులు రూ.3,811.17 కోట్ల నుంచి రూ.2,692.74 కోట్లకు తగ్గాయి. ప్రొవిజనింగ్‌ కవరేజీ నిష్పత్తి 83 శాతం నుంచి 80.77 శాతానికి పరిమితం అయింది. భవిష్యత్తు ఫలితాలపై కరోనా పరిణామాల ప్రభావం పడొచ్చని బ్యాంకు తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని