71% పెరిగిన బజాజ్‌ ఆటో లాభం
close

Published : 28/10/2021 03:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

71% పెరిగిన బజాజ్‌ ఆటో లాభం

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికంలో బజాజ్‌ ఆటో ఏకీకృత నికర లాభం 71 శాతం పెరిగి రూ.2,039.86 కోట్లుగా నమోదైంది. అసాధారణ లాభం సహా ఎగుమతులు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ వెల్లడించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.1,193.97 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.7,441.66 కోట్ల నుంచి రూ.9,080.50 కోట్లకు పెరిగింది. నెదర్లాండ్స్‌లో తమ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ బజాజ్‌ ఆటో ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ బీవీకి కేటీఎం ఏజీలో 47.99 శాతం ఉండగా, అందులోని 46.5 శాతం వాటాను పీరెర్‌ బజాజ్‌ ఏజీలో 49.9 శాతం వాటా కోసం మార్చుకోవడం (స్వాపింగ్‌) ద్వారా రూ.501 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని కంపెనీ తెలిపింది.

* మొత్తం వాహన విక్రయాలు 10,53,337 నుంచి 9 శాతం వృద్ధి చెంది 11,44,407కు చేరాయి. ఇందులో ద్విచక్ర వాహనాల విక్రయాలు 9,64,465 నుంచి 7 శాతం పెరిగి 10,29,915కు చేరాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని