ఒక ఛార్జింగ్‌తో151 కి.మీ. ప్రయాణం
close

Published : 28/10/2021 03:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక ఛార్జింగ్‌తో151 కి.మీ. ప్రయాణం

యూలర్‌ సరకు రవాణా వాహనం

దిల్లీ: విద్యుత్‌తో నడిచే త్రిచక్ర సరకు రవాణా వాహనం ‘హైలోడ్‌’ను యూలర్‌ మోటార్స్‌ అందుబాటులోకి తెచ్చింది. 2022 జనవరి నుంచి ఈ వాహన అమ్మకాలు రూ.3.5 లక్షల ధరతో ప్రారంభమవుతాయి. రూ.999 చెల్లించి వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చని యూలర్‌ మోటర్స్‌ పేర్కొంది. ఇ-కామర్స్‌ సంస్థలైన బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఉడాన్‌ నుంచి ఇప్పటికే 2,500 వాహనాలకు బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది.ప్రస్తుతం నెలకు 100 వాహనాలు తయారు చేస్తుండగా.. రాబోయే ఏడాదిలో ఈ సంఖ్యను 1000కు పెంచుతామని వివరించింది. 12.4 కిలోవాట్‌ అవర్‌ లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీతో నడిచే ఈ హైలోడ్‌ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 151 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. 688 కిలోల బరువును మోసే సామర్థ్యం దీనికి ఉందని, భారత్‌లో త్రిచక్ర సరకు రవాణా విభాగాల్లో ఇదే అత్యధికమని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని