రూ.50 లక్షల కోట్లకు విదేశీ మదుపర్ల పెట్టుబడులు
close

Updated : 28/10/2021 04:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.50 లక్షల కోట్లకు విదేశీ మదుపర్ల పెట్టుబడులు

ఏప్రిల్‌- సెప్టెంబరులో రూ.8.40 లక్షల కోట్లు పెరిగాయ్‌

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు సుమారు రూ.8.40 లక్షల కోట్లు పెరిగి (112 బిలియన్‌ డాలర్లు) పెరిగి రూ.50 లక్షల కోట్లకు (667 బిలియన్‌ డాలర్లు) చేరింది. స్టాక్‌ మార్కెట్ల అప్రతిహత జోరు ఇందుకు తోడ్పడిందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా తన నివేదికలో తెలిపింది. 2020 రెండో అర్ధభాగం నుంచి మార్కెట్‌ దూకుడు కనబరుస్తున్న సంగతి తెలిసిందే. 2020 మార్చిలో 25000 దిగువకు వెళ్లిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌... అక్కడ నుంచి 50000 (2021 ఫిబ్రవరి 3న), 60000 (సెప్టెంబరు 25న), 61000 (అక్టోబరు 14న), 62000 (అక్టోబరు 19న) ఇలా ఒక్కో మైలురాయిని అధిగమించుకుంటూ కొత్త శిఖరాలను అధిరోహించిన సంగతి తెలిసిందే. 2021 మార్చి ఆఖరుకు దేశీయ ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల విలువ 555 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.41.62 లక్షల కోట్లు)గా ఉంది. సెప్టెంబరు 2020, మార్చి 2021 మధ్య ఇది 105 బిలియన్‌ డాలర్లు పెరిగింది. సెప్టెంబరులో దక్షిణ కొరియా మార్కెట్ల నుంచి 25.5 బిలియన్‌ డాలర్లు, తైవాన్‌ నుంచి 16.7 బిలియన్‌ డాలర్ల నిధులను ఉపసంహరించుకోగా.. బ్రెజిల్‌ మార్కెట్లలోకి 8.1 బిలియన్‌ డాలర్ల నిధులు వచ్చాయని తెలిపింది. భారత సూచీలు అసాధారణ రీతిలో పెరిగినందున గణనీయ దిద్దుబాటుకు ఆస్కారం ఉందని కూడా నివేదికలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ ఇండియా హెచ్చరించింది. రెండో త్రైమాసికంలో కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ.. మార్కెట్‌ విషయంలో అప్రమత్తత అవసరమని సూచించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని