రూ.18300 కోట్ల పేటీఎం ఇష్యూ
close

Published : 28/10/2021 03:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.18300 కోట్ల పేటీఎం ఇష్యూ

ధరల శ్రేణి  రూ.2,080- రూ.2,150

దిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులు పరిమాణాన్ని  డిజిటల్‌ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం పెంచింది. ప్రతిపాదిత తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించాలని సంస్థ తాజాగా భావిస్తోంది. ఈ సంస్థలో పెట్టుబడులున్న అలీబాబా గ్రూపు సంస్థ యాంట్‌ ఫైనాన్షియల్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌ సహా మరికొన్ని సంస్థలు తమ వాటాలను మరింత తగ్గించుకోవాలని అనుకుంటుండటమే ఇందుకు కారణం. వాస్తవానికి ఐపీఓ ద్వారా రూ.16,600 కోట్లు సమీకరించాలని పేటీఎం భావించింది. ఇందులో రూ.8,300 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా, మరో రూ.8,300 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా సమీకరించాలని అనుకుంది.వాటాదార్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా అదనంగా మరో రూ.1,700 కోట్లకు సమానమైన షేర్లను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా సమీకరించదలచిన విలువ రూ.10,000 కోట్లకు పెరిగింది.  సెబీ ప్రకారం.. ఓ కంపెనీలో 25 శాతానికి మించి వాటాను కలిగి ఉండకూడదన్న నిబంధనను అనుసరించి యాంట్‌ ఫైనాన్షియల్‌ కనీసం 5 శాతం వాటాను విక్రయించాలి. పేటీఎంలో యాంట్‌ ఫైనాన్షియల్‌కు 29.6 శాతం వాటా ఉంది. నవంబరు 8-10 మధ్య పేటీఎం ఇష్యూ ప్రారంభమవుతుందని, ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.2,080- రూ.2,150గా ఉంటుందని తెలిపాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని