ఆరోగ్య బీమానూ తప్పనిసరి చేయాలి..
close

Updated : 25/06/2021 05:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య బీమానూ తప్పనిసరి చేయాలి..

- ఐఆర్‌డీఏఐ

ప్రతి ఒక్కరూ కనీసం ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి చేయాల్సిన అవసరం కనిపిస్తోందని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నాన్‌ లైఫ్‌ మెంబర్‌ టి.ఎల్‌.అలమేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘మోటారు వాహన పాలసీల తరహాలోనే ఆరోగ్య బీమా పాలసీలనూ తీసుకురావాలి. బలవంతంగా ఆరోగ్య బీమా పాలసీలను విక్రయించడం మినహా ప్రస్తుతం మరో మార్గం కనిపించడం లేదు. కొవిడ్‌-19 తర్వాత చాలామంది వ్యక్తులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఆరోగ్య బీమా పాలసీ ఉన్నవారు.. కొంతలో కొంత ఆర్థికంగా ఇబ్బందులు తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా తప్పనిసరి చేయక తప్పదనిపిస్తోంది. బీమా సంస్థలూ ఈ విషయంలో బాధ్యతగా ఉండాలి.  పాలసీదారులకు బీమా ద్వారా రక్షణ కల్పించడమే కాకుండా.. వీలైనంత వేగంగా క్లెయింలను పరిష్కరించాలి. దీంతోపాటు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకూ ప్రత్యేక బీమా పాలసీలను తీసుకురావాలి. దీనివల్ల బీమా రంగం మరింత విస్తృతం అవుతుంది’’ అని అన్నారు. ఏప్రిల్‌-మే నెలలో బీమా రంగం వృద్ధి 17శాతం వరకూ ఉంది. కొవిడ్‌-19కు సంబంధించి 19లక్షల క్లెయింలు వచ్చాయి. ఇప్పటి వరకూ 15లక్షల పాలసీలను బీమా సంస్థలు పరిష్కరించాయి. వీటి విలువ రూ.15,000 కోట్ల వరకూ ఉంటుంది.  మొత్తం 55,276 మరణ క్లెయింలు రాగా, ఇందులో 48,484 పాలసీలకు రూ.3593 కోట్ల మేరకు చెల్లించినట్లు  13వ అంతర్జాతీయ బీమా సమావేశంలో అలమేలు వెల్లడించారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని