రూ.94,000 కోట్లకు వీడియో ఓటీటీ విపణి
close

Updated : 19/07/2021 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.94,000 కోట్లకు వీడియో ఓటీటీ విపణి

2030కి సాకారం: ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌

దిల్లీ: దేశీయంగా వీడియో ఓటీటీ విపణి 2030కి రూ.94,000 కోట్ల (12.5 బిలియన్‌ డాలర్ల) స్థాయికి చేరుతుందని ఆర్‌బీఎస్‌ఏ అడ్వైజర్స్‌ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ విపణి విలువ 1.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.11,000 కోట్ల) స్థాయిలోనే ఉన్నా, నెట్‌వర్క్‌లు మెరుగు పడటం, డిజిటల్‌ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమవ్వడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధి గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. డిస్నీ+హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ వంటి దిగ్గజాలున్నా, స్థానిక, ప్రాంతీయ భాషా సంస్థలకు గణనీయ అవకాశాలు లభిస్తాయని వివరించింది. 2025కే 4 బిలియన్‌ డాలర్ల (రూ.30,000 కోట్ల) స్థాయికి ఈ పరిశ్రమ చేరనుందని పేర్కొంది. గానా, జియో సావన్‌, వింక్‌మ్యూజిక్‌, స్పోటిఫై వంటి సంస్థల ఆధిపత్యం ఉన్న ఆడియో ఓటీటీ విపణి ప్రస్తుతం 0.6 బి.డా. (సుమారు రూ.4500 కోట్ల) స్థాయిలో ఉన్నా, 2025కు
1.1 బి.డా. (సుమారు రూ.8250కోట్ల)కు, 2030కి 2.5 బి.డా. (సుమారు రూ.19,000 కోట్ల)కు చేరుతుందనే అంచనాను వ్యక్తం చేసింది. కొవిడ్‌ పరిణామాల వల్ల ఓటీటీలకు గణనీయ గిరాకీ లభిస్తోందని పేర్కొంది. ఓటీటీ ఆదాయాల్లో చందా ఆదాయం దేశీయంగా 93 శాతమని, ప్రపంచ సగటు 87 శాతమని తెలిపింది. వినియోగదారుపై సగటు ఆదాయం (ఆర్పు) కూడా 7.2 డాలర్లు (సుమారు రూ.540) ఉందని, 2025కు ఓటీటీ వినియోగదార్ల సంఖ్య 46.27 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని