ప్రభుత్వ బాండ్లలో...
close

Published : 17/09/2021 03:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ బాండ్లలో...

సీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త బాండ్‌ పథకాన్ని ఆవిష్కరించింది. దీని పేరు ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎస్‌యూ బాండ్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ 40:60 ఇండెక్స్‌ ఫండ్‌- సెప్టెంబరు 2027’. ఈ పథకం కింద సమీకరించిన నిధులను పేరులో ఉన్నట్లుగానే నిఫ్టీ పీఎస్‌యూ బాండ్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ బాండ్‌-సెప్టెంబరు 2027, 40:60 ఇండెక్స్‌లో భాగంగా ఉన్న రుణ పత్రాలపై పెట్టుబడి పెడతారు. ఇందులో 40శాతం సొమ్మును ‘ట్రిపుల్‌ ఏ’ రేటెడ్‌ బాండ్లకు కేటాయిస్తారు. మిగిలిన 60 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జారీ చేసే రుణ పత్రాలకు (ఎస్‌డీఎల్‌- స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్స్‌) మళ్లిస్తారు. బాండ్లు అన్నీ సెప్టెంబరు 30, 2027 నాటికి గడువు పూర్తయ్యేవిగా ఉంటాయి. ప్రతి మూడు నెలలకోసారి పెట్టుబడుల పనితీరును విశ్లేషించి, తదనుగుణంగా మార్పుచేర్పులు చేస్తారు. ఈ ఫండ్‌ పథకం ఎన్‌ఎఫ్‌ఓ చివరి తేదీ ఈ నెల 27. కనీస పెట్టుబడి రూ.1,000. దాదాపు 8 ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన బాండ్లు, 20 వరకూ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన రుణ పత్రాల్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఈ ఫండ్‌ పథకం మదుపరులకు అందిస్తోంది. పూర్తిగా ఈక్విటీకే పరిమితం కాకుండా.. కొంత మేరుకు రుణ పత్రాల్లోనూ పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, తక్కువ రిస్కు ఉన్న ప్రభుత్వ బాండ్లకు పరిమితం కావాలనుకునే వారికి ఈ పథకం అనువైనదిగా చెప్పొచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని