ఈ ఏడాది పసిడికి గిరాకీ అంతంతే
close

Updated : 20/10/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ఏడాది పసిడికి గిరాకీ అంతంతే

పొదుపు, వ్యవసాయ ఆదాయాలు తగ్గడం వల్లే
2022లో పుంజుకోవచ్చు: ప్రపంచ స్వర్ణ మండలి

ముంబయి: కరోనా అనిశ్చితులు కొనసాగుతుండడంతో భారత్‌లో ఈ ఏడాది పసిడి గిరాకీ స్తబ్దుగానే కొనసాగుతుందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) తాజా నివేదికలో పేర్కొంది. 2022లో మాత్రం గిరాకీ పెరగవచ్చని అంచనా వేసింది. ఆదాయాలు పెరగడంతోనే బంగారం కొనుగోళ్లు అధికమవుతాయని తేల్చిచెప్పింది.

సానుకూలతలు.. ప్రతికూలతలు: కరోనా తదుపరి దశల వల్ల ఏవైనా అనిశ్చితులు ఏర్పడితే మాత్రం వచ్చే ఏడాదీ పసిడికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేయడం వల్ల పసిడి పరిశ్రమ మరింత పారదర్శకత దిశగా అడుగులు వేసింది.  ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉంటే పసిడికి గిరాకీ కూడా పెరుగుతుంది. అయితే వ్యవసాయ ఆదాయాలు తగ్గడం ప్రతికూలమే.  దేశీయుల్లో అధికులు పొదుపు చేసుకున్న మొత్తంతో బంగారం కొంటారు. కరోనా ఆసుపత్రి వ్యయాల కారణంగా ఇలా వచ్చే మొత్తం తగ్గుముఖం పట్టిందని డబ్ల్యూజీసీ విశ్లేషించింది. ఇతరత్రా పెట్టుబడుల సాధనాలపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారంది.

ఇవీ అంచనాలు
దేశ తలసరి ఆదాయం 1 శాతం పెరిగితే.. పసిడికి గిరాకీ 0.9 శాతం మేర పెరుగుతుందని; ఒక ఏడాదిలో బంగారం ధర 1 శాతం తగ్గినా.. గిరాకీ 1.2 శాతం మేర పెరుగుతుందని, ద్రవ్యోల్బణం 1 శాతం పెరిగినా, పసిడికి గిరాకీ 2.6% పెరుగుతుందన్నది అంచనా.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని