క‌రోనాకు శానిటైజ‌ర్‌లా ఆర్థిక జీవ‌నానికి బీమా అవ‌స‌రం - get-financially-fitter-in-2021
close

Updated : 22/01/2021 14:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క‌రోనాకు శానిటైజ‌ర్‌లా ఆర్థిక జీవ‌నానికి బీమా అవ‌స‌రం

2020 మీరు అనుకున్న దానికి పూర్తిగా భిన్నంగా గ‌డిచిపోయింది. కానీ ఆ ఏడాది మనకు మునుపెన్నడూ లేని విధంగా జీవిత పాఠాలు నేర్పింది. కోవిడ్-19 సంవత్సరం ఆరోగ్యం, కుటుంబం ప్రాధాన్యతలను తెలిపింది. మనం జీవించే విధానంలో మార్పులను ఎదుర్కొన్నాము. చిన్న చిన్న విష‌యాల‌ను నుంచి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఎలా దెబ్బ‌తిందో అన్ని విష‌యాల‌పై దృష్టి పెట్టాము.


2020 సంవ‌త్స‌రం గురించి ఏదైనా సానుకూలంగా ఆలోచించాలంటే అది ఒక్క‌టే, మ‌న‌కు ఆరోగ్యం ఎంత ముఖ్య‌మో, ఆరోగ్య సంర‌క్ష‌ణ ఎంత అవ‌స‌ర‌మో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించింది. ఆరోగ్యం  కోసం కొత్త అల‌వాట్ల‌ను నేర్చుకున్నాం. దీంతో పాటు స‌మానంగా ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న‌ను ఏర్ప‌చుకున్నాం. ఇప్పుడు తెలుసుకున్న విష‌యాలైనా ఇక నుంచి అనుస‌రిస్తే   అవి మన ఆర్థిక జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి.

2021 లో ఆర్ధికంగా ఫిట్‌గా ఉండ‌టానికి మనం అనుసరించాల్సిన కొన్ని విషయాలు..

స్క్రీనింగ్ = నికర విలువ
దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి కోవిడ్-19 లక్షణాలు ఉండవచ్చు. నిర్ధార‌ణ కోసం స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. పరీక్ష ఫలితం తదుపరి చర్యను నిర్ణయిస్తుంది.
అదేవిధంగా, మీ నికర విలువకు చేరుకోవడానికి  ఆదాయం, ఖర్చులు, పొదుపులు, పెట్టుబడులు, బీమా, అప్పులను పరిశీలించ‌డం ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవ‌చ్చు.
మీ ఆర్థిక నిర్వ‌హ‌ణ  ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆన్‌లైన్ అగ్రిగేట‌ర్ల‌లో మీ  వివరాలను అందించ‌డం ద్వారా క్రెడిట్ స్కోరు , నిక‌ర విలువ‌ను తనిఖీ చేసుకోవ‌చ్చు.
శానిటైజర్ = జీవిత బీమా

చికిత్స‌ కంటే నివారణ మంచిది అని ఇప్పుడు మ‌రింత బాగా అర్థ‌మైంది. సబ్బుతో చేతులు కడుక్కోవడం, శానిటైజర్లను ఉపయోగించడం ద్వారా  పరిశుభ్రత పాటించాం. తరచుగా చేతులు కడుక్కోవడం మంచి పరిశుభ్రత సాధన. ఇది చేయ‌మ‌ని ఎవ‌రూ స‌ల‌హా ఇవ్వ‌న‌వ‌స‌రం లేకుండా మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉంటే వ్యాది మ‌నకు రాకుండా నివారించ‌వ‌చ్చు.
మ‌న జీవితంలో బీమా కూడా అదే ప‌ని చేస్తుంది.  బీమా పాల‌సీలు కుటుంబ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షిస్తాయి. మీ రిస్క్ కవర్‌ను అంచనా వేయడానికి ఇప్పుడు మీకు దొరికిన స‌మ‌యాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.  
ఇప్పటికే ఉన్న బీమా ఎంత వ‌ర‌కు హామీ ఇస్తుందో ఆన్‌లైన్‌లో పాల‌సీబ‌జార్ వంటి వాటిలో మీ పాల‌సీ వివ‌రాల‌ను ఇవ్వ‌డం ద్వారా తెలుసుకొని త‌గిన బీమా పాల‌సీల‌ను తీసుకోండి. 
ఫేస్ మాస్క్ = ఆరోగ్య బీమా
ఫేస్ మాస్క్ కూడా ముందుజాగ్రత్తగా ఉప‌యోగించ‌డం ఇప్పుడు త‌ప్ప‌నిస‌రి.  అదేవిధంగా జీవనశైలికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న విషయాన్ని విస్మ‌రించ‌లేము. ఆరోగ్య సంరక్షణ కోసం పెరుగుతున్న ఖర్చులు  బీమా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి చేస్తున్నాయి. మీకు ఆరోగ్య బీమా లేకపోతే, ఇప్పుడు దాన్ని తీసుకునే సమయం వచ్చింది.
వివిధ రకాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించడానికి ఉపయోగపడే సరైన  ఆరోగ్య బీమాను ఎంచుకోండి 
క్వారంటైన్‌ = గృహ బడ్జెట్

గ‌త ఏడాది మొత్తం  కుటుంబంతో పాటు ఇంట్లో ఉండ‌టంతో బ‌య‌ట ఖ‌ర్చులు త‌గ్గాయి. షాపింగ్ చేయ‌డం, సినిమాలు, హోట‌ళ్లు వంటి ఎటువంటి ఖ‌ర్చులు లేవు.  ఈ విష‌యాన్ని మీరు గ్ర‌హించి గృహ బడ్జెట్‌ను అంచ‌నావేస్తే,  మీ పొదుపులో పెరుగుదలను చూడవచ్చు, అది అవ‌స‌రానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉండాలి.
 కుటుంబ బడ్జెట్‌ను అభివృద్ధి చేయడానికి డిజిటల్ లేదా కాగితం బడ్జెట్ షీట్‌ను ఉపయోగించండి. డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుందో ట్రాక్ చేయండి. ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితం కోసం ఎక్కువ ఆదా చేయడానికి లేదా అప్పులను తగ్గించడానికి ఖర్చులను తగ్గించే మార్గాలను అన్వేషించండి.

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ = పొదుపు
ప‌రిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు డిజిటల్ బోధనా చేసేందుకు కొత్త మార్గాలను కనుగొంటున్నారు, ఇంటి నుంచి పనిచేసే సాంకేతిక బృందాలు, అనారోగ్యాలను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి వీడియో కాల్స్ ద్వారా వైద్యులు కూడా అందుబాటులోకి వ‌చ్చారు. ఇంటి నుంచి ప‌నిచేయ‌డంలో దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని మీరు స‌ద్వినియోగ‌ప‌రుచుకోవ‌చ్చు.
 ఆర్థిక పరిస్థితులను మెరుగుప‌ర‌చ‌డానికి ఉపయోగించండి. మీరు మరచిపోయిన పెట్టుబడి ప‌త్రాలు, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను కూడా ఈ స‌మ‌యంలో వెతికి జాగ్ర‌త్త ప‌ర‌చండి.  
సామాజిక దూరం = రుణ నియంత్రణ
సామాజిక దూరం అంటే సమావేశాలకు దూరంగా ఉండటం, జ‌న స‌మూహాల్లోకి వెళ్ల‌కుండా నియంత్ర‌ణ‌ పాటించ‌డం. అదేవిధంగా ఈ ప‌రిస్థితి మీ ఖర్చు, అలవాట్లను నియంత్రించ‌డం, ముఖ్యం రుణాల విష‌యంలో క‌ఠినంగా ఉండ‌టం నేర్పించింది. అంటే దూరంగా ఉండ‌టం ద్వారా క‌రోనాను ద‌రిచేర‌కుండా ఎలా నియంత్రించ‌వ‌చ్చో, రుణాల‌కు దూరంగా ఉండ‌టంతో మీ ఆర్థిక ప‌రిస్థితి మెరుగ్గా ఉండ‌టంతో పాటు క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవ‌చ్చు అనేది ఇక్క‌డ తాత్ప‌ర్యం. ‌ 
రుణ చెల్లింపు సాధ్యం కాకపోతే మీ బ్యాంకుతో సంప్ర‌దించ‌డం ద్వారా భ‌విష్య‌త్తులో ఇబ్బంది రాకుండా త‌గిన ప‌రిష్కారాన్ని పొందే అవ‌కాశం ఉంది.   

మహమ్మారి = పెట్టుబడులు ఉండాలి

క‌రోనా ఒక‌ అంటువ్యాధి , దీనిని మహమ్మారిగా ప‌రిగ‌ణించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి, మనందరి జీవితాల‌ను ప్రభావితం చేసింది.  అయితే దీని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి కొంత‌ సమయం , సహనం అవ‌స‌ర‌మ‌య‌య్యాయి. పెట్టుబ‌డుల విష‌యంలో కూడా ఇదేవిధంగా స‌హ‌నాన్ని పాటిస్తే దీర్ఘ‌కాలికంగా మంచి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నీసం 3-5 సంవత్సరాలు పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే త‌గిన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. 
మీ పోర్ట్‌ఫోలియోను సమీక్షించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి , పెట్టుబ‌డుల‌ను తిరిగి సమతుల్యం చేసేందుకు సలహాదారులతో సంప్రదించండి.

కోవిడ్ రిలీఫ్ ఫండ్ = ఆదాయపు పన్ను

కోవిడ్-19 ఆర్థిక చిక్కులపై పోరాడటానికి ప్రజల సహకారం అవసరం, ఈ సవాలుతో కూడిన‌ సమయాల్లో ప్రజలు ఉదారంగా విరాళం ఇవ్వాలని భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. కార్పొరేట్  సంస్థ‌ల‌తో పాటు వ్యక్తులు కూడా దీనికి స‌హ‌క‌రించారు.
మీరు చెల్లించే ఆదాయపు పన్ను, జీఎస్టీ కూడా ప్రజల జీవితాలను , దేశ మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.
  జీవితంలో వ‌చ్చే సంక్షోభాల‌ను, మార్పుల‌ను ఎదుర్కోవ‌డానికి  ఆర్థికంగా ఎప్పుడూ సిద్ధంగా ఉండాల‌ని కోవిడ్‌-19 నేర్పించింది. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని