పబ్లిక్‌ ఇష్యూకు గోఎయిర్‌ - goair getting ready for public issue
close

Updated : 15/05/2021 07:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పబ్లిక్‌ ఇష్యూకు గోఎయిర్‌

రూ.3,600 కోట్ల సమీకరణ లక్ష్యం

దిల్లీ: గోఫస్ట్‌గా పేరు మార్చుకున్న గోఎయిర్‌లైన్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ నిమిత్తం సెబీకి దరఖాస్తు పత్రాలు సమర్పించింది. ఈ ఇష్యూలో భాగంగా తాజా షేర్ల జారీ ద్వారా రూ.3,600 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. ఈ నిధులను రుణాల్లో కొంత భాగాన్ని తీర్చేందుకు, ఇంధనాన్ని సరఫరా చేసిన ఐఓసీకి రూ.254.93 కోట్లు చెల్లించేందుకు ఉపయోగించనుంది.కాగా.. దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో విమానయాన రంగానికి సంబంధించి ప్రస్తుతం స్పైస్‌జెట్‌, ఇండిగో షేర్లు మాత్రమే ట్రేడవుతున్నాయి. గోఎయిర్‌ షేర్లు కూడా ఎక్స్ఛేంజీలో నమోదైతే.. ఈ రంగం నుంచి మూడో సంస్థ అవుతుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని