ఒక్కరోజే రూ.3వేలు పెరిగిన వెండి - gold gains rs 132 silver zooms rs 2915
close

Updated : 29/01/2021 17:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్కరోజే రూ.3వేలు పెరిగిన వెండి

దిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ చుక్కలను తాకుతున్నాయి. శుక్రవారం వెండి ధర అమాంతం ఎగబాకింది. ఒక్కరోజే దాదాపు రూ.3వేలు పెరగడం గమనార్హం. అటు బంగారం కూడా స్వల్పంగా పెరిగింది.

క్రితం సెషన్‌లో రూ.65,495గా ఉన్న కేజీ వెండి ధర నేడు రూ. 2,915 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో కేజీ వెండి రూ.68,410 పలికింది. అటు బంగారం ధర రూ. 132 పెరగడంతో 10 గ్రాముల పుత్తడి రూ.48,376కు చేరింది. అంతర్జాతీయ విపణిలో ధరల పెరుగుదలతో పాటు, కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపరులు భావిస్తున్నారు. దీంతో దేశీయ విపణిలో ఈ లోహల ధరలు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1,844.35 డాలర్లు, ఔన్సు వెండి 26.35 డాలర్లుగా ఉంది.

ఇవీ చదవండి..

మరోసారి జియోను దాటి.. ఎయిర్‌టెల్‌ టాప్‌

క్లెయిం వేళలో కష్టం కాకుండా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని