మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు - gold gains rs 297 silver jumps rs 1404
close

Updated : 12/01/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు

న్యూదిల్లీ: రోజు రోజుకీ పసిడి ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం నాటి బులియన్‌ ట్రేడింగ్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.297 పెరిగి రూ.48,946కు చేరింది. అంతర్జాతీయంగా కూడా పసిడికి డిమాండ్‌ ఏర్పడిన నేపథ్యంలో మన దేశంలోనూ ధరలపై ప్రభావం చూపింది.

వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. కిలో వెండిపై రూ.1,404 పెరగడం ద్వారా రూ.65,380కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు 1858 డాలర్లుగా ఉంది. అదే సమయంలో వెండి 25.39 డాలర్లుగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరగడంతో బంగరాన్ని సురక్షిత పెట్టుబడిగా మదుపరులు భావించారని విశ్లేషకులు తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని