close

Updated : 20/01/2021 18:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
బంగారం ధర  పరుగులు

దిల్లీ: బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. పుత్తడి ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. బుధవారం రూ.347లు పెరగడంతో దేశ రాజధాని నగరంలో 10 గ్రాముల పసిడి ధర రూ.48,758గా పలికింది. అటు వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తాజాగా రూ.606లు పెరగడంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.65,814  పలికింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రకారం.. ప్రపంచంలో విలువైన లోహాల ధరల్లో పెరుగుదలే ఇందుకు కారణం. ఇకపోతే.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,854 డాలర్లు, ఔన్సు వెండి ధర 25.28 డాలర్లుగా ఉంది.

గత రెండు రోజుల్లో పెరిగిన ధరలను పరిశీలిస్తే.. పది గ్రాముల బంగారం ధరపై సోమవారం రూ.117, మంగళవారం రూ.198ల చొప్పున పెరిగింది. అలాగే, సిల్వర్‌ ధరలు కూడా సోమవారం రూ.541, మంగళవారం రూ.1008 చొప్పున పెరుగుదల నమోదు చేశాయి.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని