#Day 4: భారీగా పెరిగిన బంగారం ధర - gold price jumps
close

Published : 21/01/2021 18:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#Day 4: భారీగా పెరిగిన బంగారం ధర

దిల్లీ: బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చి పైపైకి పోతున్నాయ్‌. వరుసగా నాలుగో రోజూ వీటి ధరలు భారీగా పెరిగాయి. గురువారం ఒక్కరోజే బంగారం ధర (24 క్యారెట్ల) రూ.575లు.. వెండి ధర రూ.1227లు పెరగడం గమనార్హం. తాజా పెరుగుదలతో దేశ రాజధాని నగరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.49,125కు చేరగా.. బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.66,699లు పలికింది. ప్రపంచ మార్కెట్లో చోటుచేసుకున్న ట్రెండ్స్‌ ఆధారంగానే ఈ పెరుగుల నమోదైనట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పేర్కొంది.

కామెక్స్ (న్యూయార్క్ ఆధారిత కమోడిటీ బోర్స్‌) బంగారం ధరల్లో పెరుగుదలకు అనుగుణంగా దిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర వరుసగా నాలుగో రోజు రూ.575లు పెరిగినట్టు హెచ్‌‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ విశ్లేషకుడు (కమోడిటీస్‌) తపన్‌ పటేల్‌ తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1870.50 డాలర్లు, ఔన్సు వెండి ధర 25.83 డాలర్లుగా ఉంది.

గత మూడు రోజుల్లో పెరుగుదల ఇలా.. 
సోమవారం: బంగారం రూ.117; వెండి రూ.541
మంగళవారం: బంగారం రూ.198; వెండి రూ.1008
బుధవారం: రూ. 347; వెండి రూ.606

ఇదీ చదవండి..

సెన్సెక్స్.. 50వేల ప్రస్థానం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని