ఫ్యూచర్‌ ట్రేడింగ్స్‌: రూ.2వేలు తగ్గిన బంగారం ధర - gold slips over rs 2000 in a day future tradings
close

Updated : 09/01/2021 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్యూచర్‌ ట్రేడింగ్స్‌: రూ.2వేలు తగ్గిన బంగారం ధర

న్యూదిల్లీ: భవిష్యత్‌లో బంగారం ధరలు భారీగా పతనం కానున్నాయా? కరోనా వేళ అంతకంతకు పెరిగిపోయిన పసిడి ధరలు వ్యాక్సిన్‌ రాకతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? శుక్రవారం నాటి ఫ్యూచర్‌ ట్రేడింగ్స్‌ ఫిబ్రవరి నెలకు సంబంధించి బంగారం ధర ఏకంగా రూ.2వేలు తగ్గడం గమనార్హం.

పది గ్రాముల పసిడి 4.10శాతం క్షీణతను నమోదు చేసి, రూ.2,086 తగ్గడం ద్వారా రూ.48,818(పదిగ్రాములు)గా నమోదైంది. ఇక శనివారం దేశీయంగా బంగారం ధరలు పరిశీలిస్తే.. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,650గా నమోదు కాగా, 24 క్యారెట్లు(10గ్రాములు) రూ.54,160గా ఉంది.

ఇక వెండి ధర కూడా భారీగానే పతనమైంది. 8.8శాతం క్షీణతను నమోదు చేసిన వెండి కిలో రూ.6,100 తగ్గి, రూ.63,850గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలపడుతుండటంతో బులియన్‌ మార్కెట్‌పై ప్రభావం పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని