‘పెట్రోల్‌’పై సుంకం తగ్గిస్తారా? - govt may consider excise cut on petrol as price hikes
close

Updated : 23/01/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పెట్రోల్‌’పై సుంకం తగ్గిస్తారా?

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే చమురు మంత్రిత్వ శాఖ ఆర్థికశాఖకు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కేంద్రం దేశంలో ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. అయితే ఇప్పుడు ఇంధన ధరలు మండిపోతుండటంతో వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు సుంకాన్ని తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. 

నేడూ ధరల పెంపు..

ఇక వరుసగా రెండో రోజు దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 25పైసలు చొప్పున పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.85.70కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో రూ.92.28గా ఉంది. హైదరాబాద్‌లోనూ 26పైసలు పెరిగి రూ.89.15కు చేరింది. 
పెరిగిన ధరలతో లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ.75.88, ముంబయిలో రూ.82.66, హైదరాబాద్‌లో రూ.82.80గా ఉంది.

ఇదీ చదవండి..

నిర్మలమ్మ ముందున్న సవాళ్లు!
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని