దేశీయ తయారీకి బడ్జెట్‌లో ఊతం! - govt may tweak customs duties on host of goods in budget 2021
close

Published : 25/01/2021 16:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశీయ తయారీకి బడ్జెట్‌లో ఊతం!

దిల్లీ: ఆత్మనిర్భర్‌ భారత్‌ను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో అందుకు అనుగుణంగా కీలక ప్రకటనలు చేసేందుకు సిద్ధమవుతోంది. దేశీయంగా తయారీ, ఎగుమతులకు ఊతమిచ్చేలా కొన్ని రకాల ముడి పదార్థాలపై దిగుమతి సుంకాన్ని ఎత్తివేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఫర్నీచర్‌ తయారీలో ఉపయోగించే చెక్క, స్వాన్‌ ఉడ్‌, హార్డ్‌ బోర్డ్‌ లాంటి ముడిపదార్థాలతో పాటు రాగి ఉత్పత్తులకు ఉపయోగించే ముడిసరుకులపై కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది.

‘‘ముడి పదార్థాలపై అధిక ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నాయి. మన దేశం నుంచి ఫర్నీచర్‌ ఎగుమతులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ఫర్నీచర్‌ ముడి పదార్థాలపై సుంకాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక తారు, రాగి తుక్కు తదితర వాటిపై కూడా దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశముంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. 

దేశీయ తయారీని పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో పాటు రానున్న బడ్జెట్‌లో కొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులు, గృహోపకరణాలపై దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశముంది. దీంతో ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లు, క్లాత్‌ డ్రయర్లు తదితర వస్తువులపై ధరలు పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. 

జనవరి 29 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 

ఇవీ చదవండి..

వీటిపై సుంకాలు పెరగవచ్చు..!

మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాల బాదుడు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని