ఐదో నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు - gst collections rise 7 pc to rs 1.13 lakh cr in feb
close

Published : 01/03/2021 19:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐదో నెలా లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

దిల్లీ: కరోనా కారణంగా భారీగా పడిపోయిన జీఎస్టీ వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి. వరుసగా ఐదో నెలా వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి మొత్తం రూ.1.13 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈ వసూళ్లు 7 శాతం పెరిగాయని పేర్కొంది. జనవరి నెలతో (1.19 లక్షల కోట్లు) పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టడం గమనార్హం.

ఫిబ్రవరి నెలకు గాను వచ్చిన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ కింద రూ.21,092 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.27,273 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.55,253 కోట్లు, సెస్సులు కింద రూ.9,525 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. వరుసగా ఐదో నెలా లక్ష కోట్లు దాటాయని, జీఎస్టీ వసూళ్లు తిరిగి పుంజుకున్నాయనడానికి ఇదే నిదర్శమని ఆర్థిక శాఖ పేర్కొంది.

ఇవీ చదవండి..

గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌

స్టాక్‌ మార్కెట్‌.. రోజంతా లాభాల్లోనే


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని