Home Loan: ఉమ్మ‌డి గృహ రుణం ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌నం? - home-loan-with-a-co-applicant-or-as-the-sole-applicant
close

Updated : 13/08/2021 14:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Home Loan: ఉమ్మ‌డి గృహ రుణం ఎంత‌వ‌ర‌కు ప్ర‌యోజ‌నం?

గృహ రుణం కోసం దర‌ఖాస్తు చేసుకునే ముందు తెలుసుకోవ‌ల‌సిన ముఖ్య విష‌యాలు. స‌హ‌-దర‌ఖాస్తుదారుడితో గృహ రుణం కోసం దర‌ఖాస్తు చేయాలా, ఏకైక దర‌ఖాస్తుదారుగా గృహ రుణం తీసుకోవాలా అనేది ఆలోచించి నిర్ణ‌యించుకోవ‌డం ముఖ్యం. స‌హ‌-దర‌ఖాస్తుదారులు ఐన‌ప్ప‌టికీ ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను విడిగా పొందొచ్చు. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (పీఎమ్ఎవై) స‌బ్సిడీని పొందొచ్చు. స‌హ దర‌ఖాస్తుదారు అంటే ప్రాథమిక దర‌ఖాస్తుదారుడి ప‌క్క‌న గృహ రుణాన్ని భుజానికెత్తుకునే బాధ్య‌త‌ను స‌హ‌-దర‌ఖాస్తుదారుడు క‌లిగి ఉంటాడు. ప్రాథమిక దర‌ఖాస్తుదారు రుణాన్ని తిరిగి చెల్లించ‌లేన‌ట్ల‌యితే, స‌హ‌-దర‌ఖాస్తుదారుడిపై ఆ బాధ్య‌త ప‌డుతుంది. అయితే స‌హ‌-దర‌ఖాస్తుదారుతో గృహ రుణం దర‌ఖాస్తు చేయ‌డం రుణ ఆమోదం ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేస్తుంది. గృహ రుణం కూడా అధికంగా ల‌భించే అవ‌కాశ‌ముంది.

గృహ రుణానికి స‌హ‌-దర‌ఖాస్తుదారుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలుః అధిక రుణ అర్హ‌త రుణ‌గ్ర‌హీత‌లు త‌ర‌చుగా అర్హ‌త ప్ర‌మాణాల‌కు అనుగుణంగా లేనందున గృహ రుణ  ఆమోదానికి ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ ఇబ్బందుల్లో క‌నీస ఆదాయం, ఉద్యోగ యోగ్య‌త‌, క్రెడిట్ స్కోరు మొద‌లైన‌వి ఉన్నాయి. క్రెడిట్ అర్హ‌త ఉన్న స‌హ‌-దర‌ఖాస్తుదారుని మంచి క్రెడిట్ స్కోర్‌తో జోడించ‌డం వ‌ల‌న అటువంటి రుణగ్ర‌హీత‌ల ఆర్హ‌త మెరుగుప‌డుతుంది. వారికి ఎక్కువ రుణాన్ని అందించ‌డానికి వీలు క‌ల్గుతుంది.

మ‌హిళా స‌హ య‌జ‌మానుల‌కు ప్రోత్సాహ‌కాలుః ఒక మ‌హిళా స‌హ‌-దర‌ఖాస్తుదారు విభిన్న వ‌డ్డీ రేట్ల‌కు అర్హులు. ఈ వ‌డ్డీ రేట్లు సాధార‌ణంగా చాలా బ్యాంకులు అందించే ప్రామాణిక రేట్ల కంటే త‌క్కువ‌గా ఉంటాయి. అయితే ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌డానికి, ఆమె త‌ప్ప‌నిస‌రిగా స‌హ‌-దర‌ఖాస్తుదారు, రుణం యొక్క ప్రాథమిక దర‌ఖాస్తుదారు అయి ఉండాలి. 

ప‌న్ను ప్ర‌యోజ‌నాలుః ఆదాయ ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీ, 24బి గృహ రుణాల‌పై రుణ‌గ్ర‌హీత‌ల‌కు కొన్ని ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. రుణంలో స‌హ‌-దర‌ఖాస్తుదారులు అయిన స‌హ య‌జ‌మానులు, సెక్ష‌న్ 24బి కింద ప్ర‌తి సంవ‌త్స‌రం గృహ రుణం వ‌డ్డీపై రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. సెక్ష‌న్ 80సి కింద చెల్లించిన అస‌లుపై వారు సంవ‌త్స‌రానికి గ‌రిష్టంగా రూ. 1.50 ల‌క్ష‌ల మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. స‌హ‌-దర‌ఖాస్తుదారులు ఈ ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను విడి విడిగా పొందొచ్చు. 

అయితే స‌హ-దర‌ఖాస్తుదారుతో అనుకూల‌త‌లే కాకుండా కొన్ని ఇబ్బందులు కూడా లేక‌పోలేదు, అవి కూడా జాయింట్‌గా గృహ రుణం తీసుకునేవారు ప‌రీశీల‌న‌లోకి తీసుకోవాలి.

1) స‌హ‌-దర‌ఖాస్తుదారు మ‌ర‌ణంః స‌హ‌-దర‌ఖాస్తుదారు మ‌ర‌ణం అనుమాన‌స్ప‌ద‌మైతే మిగిలిన దర‌ఖాస్తుదారు, మొత్తం ఆస్తి వాటాకి అర్హులు కాక‌పోవ‌చ్చు. ఆస్తి స‌హ‌-దర‌ఖాస్తుదారు, మ‌ర‌ణించిన‌వారి బంధువుల మ‌ధ్య విభ‌జించ‌బ‌డ‌వ‌చ్చు. స‌హ‌-దర‌ఖాస్తుదారుల మ‌ధ్య విడాకుల విష‌యంలో, స‌హ‌-దర‌ఖాస్తుదారు గృహ రుణాన్ని తిరిగి చెల్లించ‌డానికి నిరాక‌రిస్తే.. గృహ రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్య‌త ఇత‌ర దర‌ఖాస్తుదారుపై ప‌డుతుంది.

2) క్రెడిట్ స్కోరుః రుణ‌గ్ర‌హీత‌లు గుర్తుంచుకోవ‌ల‌సిన మ‌రో విష‌యం ఏమిటంటే,  గృహ రుణ `ఈఎమ్ఐ` చెల్లించ‌డానికి నిరాకరించినా లేక ఆలస్యం చేసినా క్రెడిట్ స్కోరు త‌గ్గిపోయే ప్ర‌మాద‌ముంది. ఇది ఉమ్మడి రుణాలకు కూడా వరిస్తుంది. ఒకరు రుణం చెల్లించకపోతే ఇద్దరి క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం ఉంటుంది. భ‌విష్య‌త్తులో రుణం కోసం దర‌ఖాస్తు చేస్తున్న‌ప్పుడు రుణ అర్హ‌త త‌గ్గ‌డానికి దారితీస్తుంది. 

రుణం అనేది వ్యక్తిగత నిర్ణయం. మీరు ఒక్క‌రే రుణం కోసం దర‌ఖాస్తు చేసుకోవాలా, స‌హ‌-దర‌ఖాస్తుదారుడితో దర‌ఖాస్తు చేసుకోవాలా అనేది ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితి, భ‌విష్య‌త్తులో ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుని స‌రైనా, బ‌ల‌మైన నిర్ణ‌యాలు తీసుకోవాలి. మీ క‌ల‌ల ఇంటిని సొంతం చేసుకోవ‌డానికి మీరు అడుగులు వేసేట‌ప్పుడు ఇటువంటి అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. అపుడే స‌రైన గృహ రుణ ఎంపిక అవ్వ‌గ‌ల‌దు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని