Honda Unicorn: యూనికార్న్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ - honda unicorn now offered with cashback of rs 3500
close

Published : 01/06/2021 22:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Honda Unicorn: యూనికార్న్‌పై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: హోండా మోటార్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా వినియోగదారులకు యూనికార్న్‌ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ జూన్‌ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది.  ఈ పథకం కింద రూ.3,500 వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. దీనిని అందిపుచ్చుకోవాలంటే వినియోగదారుడు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డును వినియోగించి రూ.40,000 చెల్లించాలి. ఇటువంటి క్యాష్‌ బ్యాక్‌నే ఎక్స్‌-బ్లేడ్‌,షైన్‌,హార్నెట్‌2.0,గ్రిజా125,యాక్టివా 6జీ, డియోలపై కూడా అందిస్తోంది. దేశంలోని ఆయా ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులు చేర్పులు ఉంటాయి.

ఇక హోండా తన ప్లాంట్లలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది. ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించింది. హర్యానాలోని మన్నెసార్‌, రాజస్థాన్‌లోని తపుకర,గుజరాత్‌లోని విఠల్‌పుర్‌లో ప్లాంట్లను తెరిచినట్లు వెల్లడించింది.  కర్ణాటకలోని నర్సాపూర్‌ ప్లాంట్‌లో కార్యకలాపాలను మాత్రం మొదలుపెట్టలేదు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌  సమయంలో హోండా నాలుగు ప్లాంట్లను మూసివేసింది. ఇప్పుడు తాజాగా వాటిల్లో మూడు ప్లాంట్లను తెరిచింది. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని