PPF ఖాతా... ఎంత కాలం కొనసాగిస్తే మంచిది? - how-long-continue-investments-in-your-child-PPF-account
close

Updated : 23/06/2021 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PPF ఖాతా... ఎంత కాలం కొనసాగిస్తే మంచిది?

ఇంటర్నెట్‌ డెస్క్: పిల్ల‌ల భ‌విష్య‌త్తును ఆర్థికంగా సుస్థిరం చేయ‌డం కోసం వారి చిన్న‌తనం నుంచే త‌ల్లిదండ్రులు పొదుపు చేయడం ప్రారంభిస్తారు. ఇందుకోసం ఎంచుకునే పెట్టుబ‌డి మార్గాల్లో ప‌బ్లిక్ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF) ఖాతా ఒక‌టి. చాలా మంది త‌ల్లిదండ్రులు ఖాతానైతే ప్రారంభిస్తున్నారు. కానీ కాలం గ‌డిచే కొద్ది పెట్టుబ‌డులు త‌గ్గిస్తున్నారు. కొన్ని సంవ‌త్స‌రాల‌కు పూర్తిగా నిలిపేస్తున్నారు. పిల్ల‌ల కోసం పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌డం ఒక అద్భుత‌మైన ఆలోచ‌న‌. అయితే మీ పిల్ల‌ల‌కు పూర్తి ప్ర‌యోజ‌నాలు అందాలంటే.. పెట్టుబ‌డులు స్థిరంగా ఉండేలా చూసుకోవ‌డం, ఖాతాను దీర్ఘ‌కాలం పాటు పూర్తిస్థాయిలో నిర్వ‌హించ‌డమూ ముఖ్య‌మే.


పీపీఎఫ్ ఖాతాతో స్థిర‌త్వం ఎందుకు?

ఉదాహ‌ర‌ణ‌ 1: మీ 10 సంవ‌త్స‌రాల పాప కోసం పీపీఎఫ్ ఖాతాను తెరిచార‌నుకుందాం. ₹500 నెల‌వారీ కంట్రిబ్యూష‌న్‌తో ఖాతాను ప్రారంభించి, 15 సంవ‌త్స‌రాల పాటు ఖాతాను కొన‌సాగిస్తే పాప‌కు 25 సంవ‌త్స‌రాలు వ‌చ్చేసరికి 7 శాతం వ‌డ్డీ రేటు ప్ర‌కారం దాదాపు ₹1,60,000 వ‌స్తుంది. అప్ప‌టికి పాప చ‌దుపు పూర్తి చేసుకుని, ఉద్యోగంలో చేరి ఖాతాను మ‌రో 35 సంవ‌త్స‌రాలు కొన‌సాగిస్తే, అదే 7 శాతం వ‌డ్డీ రేటు ప్ర‌కారం రూ.27,86,658 నిధిని కూడ‌బెట్టొచ్చు. ఇక్క‌డ పెట్టుబ‌డులు కొన‌సాగించిన మొత్తం కాలం 50 సంవ‌త్స‌రాలు. 

ఉదాహ‌ర‌ణ‌ 2: పాప 22 ఏళ్ల‌కు చ‌దుపు పూర్తిచేసుకుని, మొద‌టి ఉద్యోగంలో చేరింది అనుకుందాం. ఉద్యోగంలో చేరిన‌ప్పుడే అంటే త‌న 22 ఏళ్ల వ‌య‌సులో ₹500కి బ‌దులుగా నెల‌కు ₹1,000 పీపీఎఫ్ ఖాతాలో పెట్టుబ‌డి పెడితే, ఆమెకు 60 ఏళ్లు వ‌చ్చేస‌రికి 7 శాతం వ‌డ్డీ రేటు చొప్పున ₹23,72,635 మొత్తం స‌మ‌కూర్చుగ‌ల‌దు. ఇక్క‌డ పెట్టుబ‌డులు కొన‌సాగించిన కాలం 38 సంవ‌త్స‌రాలు. 

మొద‌టి ఉదాహరణతో పోలిస్తే, రెండో సంద‌ర్భంలో పెట్టుబ‌డులు రెట్టింపయ్యాయి. అయిన‌ప్ప‌టికీ, త‌క్కువ మొత్తాన్ని స‌మ‌కూర్చుకోగ‌లిగారు. ఇదే కాంపౌండ్ వ‌డ్డీ ప్ర‌భావం. అందుకే వీలైనంత తొంద‌రగా పెట్టుబ‌డులు ప్రారంభిచాల‌ని చెబుతుంటారు నిపుణులు. మొద‌టి ఉదాహ‌ర‌ణ‌లో త‌క్కువ పెట్టుబ‌డి పెట్టిన‌ప్ప‌టికీ, పెట్ట‌బ‌డులు పెట్టిన కాలం ఎక్కువ‌. అందువ‌ల్లే కాంపౌండ్ వ‌డ్డీతో ఎక్కువ మొత్తం స‌మ‌కూరింది.


మైన‌ర్‌తో పీపీఎఫ్ ఖాతాను తెరిచే ముందు తెలుసుకోవాల్సిన విష‌యాలు..

* మైన‌ర్ త‌ర‌పున త‌ల్లిదండ్రుల్లో ఒకరు మాత్ర‌మే ఖాతా తెర‌వ‌గ‌ల‌రు. వారు భార‌తీయులై ఉండాలి.

* గార్డియ‌న్ కేవైసి పూర్తి చేయాలి. దీంతోపాటు, మైన‌ర్ ఫోటో, వ‌య‌సును ధ్రువీక‌రణ ప‌త్రం (ఆధార్ లేదా జ‌న‌న న‌మోదు ప‌త్రం), మొద‌టి కాంట్రీబ్యూష‌న్‌కు సంబంధించిన చెక్కు ఇవ్వాలి. 

* మైన‌ర్‌కు 18 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు త‌ల్లిదండ్రులు ఖాతాను నిర్వ‌హించ‌వ‌చ్చు. 

* మైన‌ర్ త‌ల్లి లేదా తండ్రి లేదా చ‌ట్ట‌ప‌ర‌మైన సంర‌క్ష‌కుడు ఏడాదికి గ‌రిష్ఠంగా ₹1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పాప‌/బాబు త‌రపున పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. 

* త‌ల్లి లేదా తండ్రి పేరున కూడా పీపీఎఫ్ ఖాతా ఉంటే.. రెండు ఖాతాల‌లోనూ క‌లిపి గ‌రిష్టంగా ఏడాదికి ₹1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్టే వీలుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఖాతాలో పెట్టుబ‌డి పెట్టే మొత్తాన్ని విభ‌జించాల్సి ఉంటుంది. 



మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని