ప్రతి నెలా మనం ఎంత పొదుపు చేయడం మంచిది? - how much we need to save per month
close

Updated : 01/01/2021 17:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి నెలా మనం ఎంత పొదుపు చేయడం మంచిది?

ఒకప్పుడు బ్యాంకులు డిపాజిట్ల కోసం ఎదురు చూసేవి. కానీ ఇప్పుడు అవే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాయి. ఏటీఎమ్ కి వెళితే అక్కడ కూడా రుణాల గురించి ప్రచారాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత రుణాలు, ఇంటి రుణాలు, ఇలా ఎన్నో రకాల రుణాలు ఉన్నాయి. చాలా తక్కువ సందర్భాల్లో పొదుపు, మదుపు గురించి చెప్తున్నారు. ఆఖరికి కొత్తగా చేరిన ఉద్యోగులకు బ్యాంకు ఖాతా తెరిచినప్పుడు కూడా రుణాలు, క్రెడిట్ కార్డుల గురించే చెప్తున్నారు. ఒకసారి గణాంకాలు చుస్కున్నట్టయితే ఆర్ధిక సంవత్సరం 2012 లో ఇంటి అప్పుల సంఖ్య జీడీపీ లో 8.5 శాతం ఉండగా ఇప్పుడది 13.5 శాతానికి చేరింది. అదే పొదుపు అయితే 2012 లో 24 శాతం ఉండగా ఇప్పుడు అది 16 శాతానికి పడిపోయింది. ఈ ఒక్క సంఖ్య తో మనం ఏ వైపు వెళ్తున్నామో తెలుస్తోంది. మరింత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువత రుణాలు తీసుకునేది గాడ్జెట్ లు, విలాసవంతమైన పెళ్లిళ్లు, యాత్రలు లాంటి వాటి కోసమే కానీ ఆర్ధిక లక్షయాల కోసం కాదు. దీర్ఘకాలం గురించి వారికి పెద్దగా ఆసక్తి ఉండటం లేదు. పైగా ఇంటి రుణం అన్నది తప్పనిసరి అని భావించడం గమనార్హం. పొదుపు పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ విషయంలో బ్యాంకులు, అలాగే అర్బీఐ పాత్ర కూడా ఎంతో ఉంది. డిజిటల్ అక్షరాస్యత గురించి ఎలాగైతే అవగాహన తీసుకు వస్తున్నారో అదే విధంగా పొదుపు గురించి కూడా అవగాహన తేవాల్సిన అవసరం ఉంది.

అసలు ఎంత పొదుపు చేయాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం నెల నెలా కనీసం 30 శాతం పొదుపు చేస్తే మంచిది. ఇందులో సగం దీర్ఘకాల ఆర్ధిక లక్ష్యాలు అంటే పిల్లల చదువు లేదా పెళ్లిళ్లు, పదవీ విరమణ లాంటి వాటి కోసం మదుపు చేయాలి. ఇది మానవీయంగా ప్రతి నెలా చేయడం అంత సులభం కాదు కావున ఆటోమేటిక్ గా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

మ్యూచువల్ ఫండ్లలో సిప్ ద్వారా మదుపు చేయడం వలన ఇది సాధ్యం. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్లలో మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటు ఎన్పీఎస్, పీపీఎఫ్ లాంటి పథకాల్ని కూడా ఎంచుకోవచ్చు. బ్యాంకు పొదుపు ఖాతాలో అధికంగా డబ్బు ఉంచడం పెద్దగా ఉపయోగకరం కాదు. దీని కంటే ఆ డబ్బుని ఒక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ కి బదిలీ చేయడం వలన అధిక రాబడి పొందొచ్చు. అలాగే మీ అవసరాన్ని బట్టి మదుపు చేసే పధకాన్ని ఎంచుకోవాలి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని