ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని మరొకరికి విక్రయించినప్పుడు బీమా పాలసీ బదిలీ జరుగుతుంది. వాహనాన్ని విక్రయించినప్పుడు, దానికి సంబంధించిన పాలసీని కూడా కొత్త యజమాని పేరుపై బదిలీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాహనాన్ని అమ్మిన తరువాత రోడ్డు ప్రమాదం జరిగితే బీమా సంస్థ దావాను తిరస్కరించవచ్చు.
ద్విచక్ర వాహన బీమాను బదిలీ చేయు విధానం..
1. కొత్త యజమాని పేరుపై వాహన రిజిస్ట్రేషన్ బదిలీ ప్రక్రియ పూర్తైన 15 రోజులలోపు ద్విచక్ర వాహన బీమా పాలసీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
2. బీమా బదిలీ కోసం కావలసిన అన్ని పత్రాలను సేకరించాలి. ఉదాహరణకు, ద్విచక్ర వాహన ఆర్సీ(రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్), యాజమాన్య బదిలీ పత్రాలు, ఇప్పటికే ఉన్న బీమా పాలసీ మొదలైనవి.
3. కేవైసీ(మీ ఖాతా దారుని తెలుసుకోండి) కోసం, ఆధార్ కార్డు, డ్రావింగ్ లైసెన్స్ మొదలైన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. వాహన విక్రేత, కొనుగోలుదారుడు ఇరువురు ఒకే విధంగా సమర్పించాలి.
ప్రాంతీయ రవాణా కార్యాలయం(ఆర్టీఓ) ఆఫీస్ వద్ద యజమాన్య బదిలీ చేసుకున్న తరువాత, బీమా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం దరఖాస్తు ఫారంతో పాటు బదిలీ బదిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫారం 29, ఫారం 30, ఎమిషన్ టెస్ట్ పేపర్లు, సేల్ డీడ్, విక్రేత నో అబ్జెక్షన్ క్లాజ్ (ఎన్ఓసి), ఇన్స్పెక్షన్ రిపోర్ట్(బీమా సంస్థ ఇస్తుంది), పాత పాలసీ డాక్యుమెంట్ వంటి ఇతర పత్రాలను బీమా సంస్థకు అందించాలి. వీటితో పాటు కొంత నామమాత్రపు రుసమును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ పూర్తైన తరువాత బదిలీ చేసిన పత్రాన్ని అందజేస్తుందని ప్రోబస్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ రాకేశ్ గోయల్ వివరించారు.
నో క్లెయిమ్ బోనస్ మాటేంటి?
సాధారణంగా బీమా సంస్థలు, ఒక సంవత్సరం మొత్తం మీద ఏవిధమైన క్లెయిమ్ ఫైల్ చేయని వారికి సంవత్సరం చివరన పునరుద్దరణ ప్రమీయంపై డిస్కౌంటును ఇస్తారు. దీనినే నో క్లెయిమ్ బోనస్(ఎన్సీబీ) అంటారు.
బైక్ బీమా పాలసీని బదిలీచేస్తున్నప్పుడు, ఎన్సీబీ సర్టిఫికేట్ను బీమా సంస్థకు సమర్పించడం ద్వారా కొత్త ద్విచక్ర వాహన బీమా ప్రీమియంపై రాయితీ పొందవచ్చు.
"వాహన విక్రేత పాలసీని బైక్ కొనుగోలు చేసిన వ్యక్తికి బదిలీ చేయవచ్చు. కానీ పాలసీకి సంబంధించిన ఎన్సీబీని మాత్రం బదిలీ చేయలేరు. అయితే పాత వాహనం ఎన్సీబీని, అతను/ ఆమె కొనుగోలు చేసే కొత్త వాహనానికి బదిలీ చేసుకోవచ్చు. ఒక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి. ద్విచక్ర వాహనానికి సంబంధించిన పాలసీ ఎన్సీబీని మరో కొత్త ద్విచక్ర వాహన పాలసీకి మాత్రమే బదిలీ చేస్తారు. నాలుగు చక్రాల వాహనానికి బదిలీ చేయరు." అని గోయల్ తెలిపారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?