close
Array ( ) 1

తాజా వార్తలు

దేశంలో రెండో 5జీ ఫోన్‌ ఇదిగో...

భారత్‌లోకి ప్రవేశించిన ఐక్యూ

దిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ‘ఐక్యూ’ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఐక్యూ3 పేరుతో మంగళవారం భారత మార్కెట్‌లోకి తొలి మొబైల్‌ను విడుదల చేసింది. ఆ సంస్థ నుంచి విడుదలైన తొలి 5జీ ఫోన్‌ ఇదే. అయితే మన దేశంలో రెండోది. రియల్‌మీ ‘50ఎక్స్‌ ప్రో’ పేరుతో తొలి 5జీ మొబైల్‌ను సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. 4జీ, 5జీ వేరియంట్లలో లభించనున్న ఈ ఫోన్‌ ప్రారంభ ధరను రూ.36,990గా నిర్ణయించారు. మార్చి 4 నుంచి ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. భారత్‌లో ఈ మొబైల్‌కు ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

‘ఐక్యూ3’ ప్రత్యేకతలు:
ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్‌వేర్‌పై ఐక్యూ 3 పనిచేస్తుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ అమర్చారు. 6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ, హెచ్‌డీఆర్‌ 10+ సూపర్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే అందిస్తున్నారు. దీనికి 4,400ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు. కెమెరా విషయానికొస్తే.. ప్రధానంగా వెనకవైపున 48 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంటుంది. దాంతో పాటు 13ఎంపీ టెలీఫొటో లెన్స్‌, 13 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ సెన్సర్‌, మరొకటి 2 ఎంపీ పొట్రయిట్‌ కెమెరా అమర్చారు. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్‌ కెమెరా అందిస్తున్నారు. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ ఉంటుంది. 

ఐసీసీఐ కార్డుతో రూ.3 వేలు:
ఐక్యూ 3 ‘4జీ’ మొబైల్‌లో రెండు వేరియంట్లు ఉంటాయి. 8 జీబీ/128 జీబీ ఫోన్‌ ధర రూ.36,990. 8జీబీ/ 256 జీబీ ధర రూ.39,990. 5జీ మొబైల్‌ విషయానికొస్తే.. 12 జీబీ/256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ తీసుకొస్తున్నారు. దీని ధర రూ.44,990. క్వాంటమ్‌ సిల్వర్‌, వొల్కనో ఆరెంజ్‌, టోర్నడో బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఐసీఐసీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేసేవారికి రూ. 3 వేలు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ ఇస్తారు. జియో వినియోగదారులకు మొత్తం రూ.12 వేల విలువైన అదనపు ప్రయోజనాలు ఇస్తారట. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.