ఐసీఐసీఐ లాంబార్డ్‌ లాభం రూ.346 కోట్లు - icici Lombard profit is rs 346 cr
close

Updated : 18/04/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐసీఐసీఐ లాంబార్డ్‌ లాభం రూ.346 కోట్లు

దిల్లీ: జనవరి- మార్చి త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నికర లాభం 23 శాతం పెరిగి రూ.346 కోట్లుగా నమోదైంది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఈ సంస్థ రూ.282 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం కూడా రూ.3,181 కోట్ల నుంచి రూ.3,478 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2020-21) నికర లాభం 23.4 శాతం వృద్ధితో రూ.1,194 కోట్ల నుంచి రూ.1,473 కోట్లకు చేరింది. ఇక స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం రూ.14,003 కోట్లుగా నమోదైంది. 2019-20లోని రూ.13,313 కోట్లతో పోలిస్తే పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.4 (40%) తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని