ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం నాలుగింతలు - icici bank profits four fold
close

Updated : 25/04/2021 08:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం నాలుగింతలు

జనవరి- మార్చిలో రూ.4,886 కోట్లు

ముంబయి: జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన ఐసీఐసీఐ బ్యాంక్‌ నికర లాభం నాలుగింతలు పెరిగి రూ.4,886 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే సమయంలో రూ.1,251 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ.40,121 కోట్ల నుంచి రూ.43,621 కోట్లకు పెరిగింది. స్టాండలోన్‌ పద్ధతిలోనూ ఈ బ్యాంకు నికర లాభం మూడు రెట్లకు పైగా పెరిగి రూ.4,402 కోట్లకు చేరింది. ఏడాదిక్రితం ఇదే సమయంలో ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంకు రూ.1,221 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. మొత్తం స్టాండలోన్‌ ఆదాయం రూ.23,443.66 కోట్ల నుంచి పెరిగి రూ.23,953 కోట్లకు చేరింది.  సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 17 శాతం పెరిగి    రూ.10,431 కోట్లకు చేరింది. నికర వడ్డీయేతర ఆదాయం ఓ మోస్తరుగా పెరిగి రూ.4,137 కోట్లుగా నమోదైంది. 2021 మార్చి చివరి నాటికి స్థూల నిరర్థక ఆస్తులు 4.38 శాతం నుంచి 4.96 శాతానికి పెరిగాయి. కొత్తగా రూ.5,523 కోట్లు మొండి బకాయిలుగా మారడం ఇందుకు కారణమైంది. మొండి బకాయిలు, ఇతరత్రా అవసరాల కోసం రూ.2,883,47 కోట్లను ఐసీఐసీఐ బ్యాంక్‌ కేటాయించింది. ఇందులో కేవలం కొవిడ్‌-19 కోసమే రూ.1000 కోట్లు కేటాయింపులు జరిపింది. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ.2 (100%) డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని