కూతురికి ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇస్తే పన్ను వర్తిస్తుందా? - if flat gifted to daughter by her father will there be any tax liability
close

Published : 03/04/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కూతురికి ఫ్లాట్‌ గిఫ్ట్‌గా ఇస్తే పన్ను వర్తిస్తుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ తండ్రి తన కూతురికి ఫ్లాట్‌ని బహుమతిగా ఇస్తే పన్ను వర్తిస్తుందా? వర్తిస్తే ఎవరు దాన్ని భరించాల్సి ఉంటుంది. దానిపై అద్దె రూపంలో సమకూరే ఆదాయంపై పన్ను సంగతేంటి?ఒకవేళ ఆ ఫ్లాట్‌ని అమ్మితే వచ్చే మూలధన రాబడిపై పన్నులు వర్తిస్తాయా? ఇలాంటి సందేహాలు సహజం కదా! మరి ఈ వివరాలపై ఓ లుక్కేద్దాం!

సాధారణంగా బహుమానం ఇచ్చేవారు దాని విలువపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అసవరం ఉండదు. అయితే ఆ బహుమానాన్ని స్వీకరించే వారు మాత్రం కొన్ని సందర్భాల్లో ఆ విలువను తమ ఆదాయాల్లో కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒక ఏడాది కాలంలో అందుకున్న బహుమానాల విలువ రూ.50 వేలు దాటకపోతే దానిపై గ్రహీత ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూ.50 వేలు దాటితే మాత్రం కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అయితే, ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. బహుమానం ఇచ్చిన వారు సమీప బంధువులైతే(తండ్రితో సహా) ఎలాంటి పరిమితి లేకుండా బహుమతి మొత్తం విలువపై పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే ఓ తండ్రి తన కూతురికి ఫ్లాట్‌ని గిఫ్ట్‌గా ఇస్తే ఎవరూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక బహుమానం ద్వారా పొందిన ఆస్తిపై సంపాదించిన లేదా లభించే ఆదాయంపై గ్రహీత మేజర్‌ అయితే కచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అయితే, ఆ రాబడిని తండ్రి ఆదాయంతో కలిపితే క్లబ్బింగ్‌ నిబంధనలు వర్తిస్తాయి. అలాగే కుమార్తె మైనర్‌ అయినా క్లబ్బింగ్‌ నిబంధనలే వర్తిస్తాయి. తండ్రి ఆదాయంతో కలిపే రాబడిపై రూ.1,500 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక కూతురు మేజర్‌ అయి ఉండి, ఆ ఫ్లాట్‌ని అమ్మితే వచ్చే మూలధన లాభాలు పన్ను పరిధిలోకి వస్తాయి. ఒకవేళ మైనర్‌ అయితే మళ్లీ క్లబ్బింగ్‌ నిబంధనలు వర్తిస్తాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని