ఎఫ్‌డీఐల నిబంధనల సడలింపు? - india considers easing rules to attract fdi in construction sector
close

Updated : 30/01/2021 19:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎఫ్‌డీఐల నిబంధనల సడలింపు?

 

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోకి ఎఫ్‌డీఐలు వచ్చే మార్గాలను బలోపేతం చేసి ఆర్థిక వ్యవస్థలో కొత్త జవసత్వాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ఆరంభిస్తోంది. ఈ క్రమంలో లిమిటెడ్‌ లైబిలిటీ పార్టనర్‌షిప్‌(ఎల్‌ఎల్‌పీ) సంస్థలు పెట్టుబడులు పెట్టేలా అనుమతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆంగ్లవార్త సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. యానిమేషన్‌,విజువల్‌ ఎఫెక్ట్స్‌,గేమింగ్‌, కామిక్‌ రంగాల్లో నూరుశాతం ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే అవకాశం ఉంది. ఇక నిర్మాణ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టే మార్గాలను మరింత సరళీకరించనున్నారు. 

లిమిటెడ్‌ లైబిలిటీ పార్టనర్‌షిప్‌ సంస్థలను టౌన్‌షిప్‌లు, రోడ్లు,హోటళ్లు, ఆసుపత్రుల నిర్మాణంలోకి అనుమతించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఈ విషయాన్ని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ప్రకటించవచ్చు. నిర్మాణ రంగం గతంలో ఎన్నడూ ఎదుర్కోనంత ప్రతికూల పరిస్థితులను చూస్తోంది. దీనిని కష్టాల నుంచి బయటపడేసేందుకు, ఉద్యోగాలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ ముగిసి నెలలు గడిచినా ఆర్థిక వ్యవస్థ అనుకున్న స్థాయిలో పుంజుకోలేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే సుమారు మౌలిక  రంగాల్లో 2022 నాటికి  777 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు అవసరమని ప్రభుత్వం అంచనావేస్తోంది.  

భారత్‌లోని నిర్మాణ రంగంలో 2020 సెప్టెంబర్‌ నాటికి కేవలం 25.7 బిలియన్‌ డాలర్లు మాత్రమే పెట్టుబడుల రూపంలో వచ్చాయి. ఎఫ్‌డీఐల  నిబంధనలు సడలిస్తే ప్రభుత్వం అందుబాటు ధరల్లో గృహనిర్మాణ లక్ష్యాలను కూడా తేలిగ్గా అందుకొంటుంది. దీంతో పాటు 100 స్మార్ట్‌సిటీల నిర్మాణం కూడా వేగవంతం అవుతుంది. ప్రస్తుతం భారత్‌లోని నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆయా విదేశీ సంస్థలు కొన్ని నిబంధనలను పూర్తిచేయాలి. ఒక వేళ వీరు పెట్టుబడులు ఉపసంహరించాలన్నా మూడేళ్ల లాక్‌ఇన్‌ పిరియడ్‌ ఉంది. 

ఇవీ చదవండి

పురపాలనకు బలం..!

కొంచెం చూసి పన్నేయండి..!
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని