2021లో భారత్‌దే హవా! - indian economy estimates by un
close

Published : 26/01/2021 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2021లో భారత్‌దే హవా!

న్యూయార్క్‌: భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2021లో 7.3 శాతం వృద్ధి నమోదు చేయనుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మహమ్మారి కారణంగా వినియోగం పడిపోయినందున 2020లో జీడీపీ 9.6 శాతం క్షీణించనున్నట్లు తెలిపింది. కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా నష్టపోయిందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అవకాశాలపై ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం తయారు చేసిన నివేదిక ఈ మేరకు స్పష్టం చేసింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గత ఏడాది 4.3 శాతం క్షీణించిందని నివేదిక పేర్కొంది. ఇది 2009 నాటి సంక్షోభంతో పోలిస్తే రెండున్నర శాతం ఎక్కువని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2021లో 4.7శాతం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నప్పటికీ.. 2020లో కలిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేమని వివరించింది. 2021లో వృద్ధి రేటు విషయంలో భారత్​ తర్వాతి స్థానంలో చైనా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. డ్రాగన్‌ 7.2 శాతం వృద్ధి రేటు నమోదు చేయనున్నట్లు లెక్కగట్టింది. 

ఇక దక్షిణాసియా దేశాల్లో 2021లో సగటున 6.9 శాతం వృద్ధి రేటు నమోదైనా.. 2020లో కలిగిన నష్టాల్ని మాత్రం పూడ్చలేమని నివేదిక తెలిపింది. కరోనాతో పాటు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ఒడుదొడుకులు దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీశాయని వివరించింది. కరోనా ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ఇవీ చదవండి...

టిక్‌టాక్‌పై భారత్‌లో శాశ్వత నిషేధం?

ముకేశ్‌ సెకను సంపాదన.. సామాన్యుడి మూడేళ్ల ఆర్జన


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని