close

Published : 17/01/2021 13:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రేపటి నుంచి ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీవో మొదలు

 తొలిసారి మార్కెట్‌కు భారత ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సోమవారం నుంచి ఐపీవోకు బిడ్లను స్వీకరించనుంది. ఐఆర్‌ఎఫ్‌సీ (ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌) రూ.4,633 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చింది. జనవరి 18వ తేదీ నుంచి దీనికి సంబంధించిl బిడ్ల స్వీకరణ మొదలవుతుంది. ఒక్కో షేరు ధర రూ.25-రూ.26 మధ్య ఉండవచ్చు. దీనికి సంబంధించి యాంకర్‌ ఇన్వెస్టర్లకు 15వ తేదీ నుంచే బుకింగ్స్‌ మొదలుపెట్టింది. శుక్రవారం నాటికి రూ.1,398 కోట్లను సేకరించినట్లు సమాచారం.  ప్రభుత్వ రంగానికి చెందిన ఒక ఎన్‌బీఎఫ్‌సీ ఐపీవోకు రావడం ఇదే తొలిసారి. లిస్టింగ్‌కు వచ్చిన ఐదో రైల్వే కంపెనీ ఇదే. ఈ ఆఫర్‌లో 50శాతం క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్లకు రిజర్వు చేశారు. 15శాతం నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. మిగిలిన 35శాతం వాటాలను రిటైల్‌ ఇన్వెస్టర్లకు విక్రయించనున్నారు. 

ఐఆర్‌ఎఫ్‌సీ వ్యాపారం విభిన్నంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, రైల్వే మంత్రిత్వశాఖ కానీ నిబంధనలు మారిస్తే దీని లాభంపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి ఈ ఐపీవోలోని ప్రైస్‌బ్యాండ్‌ను చూస్తే కొనుగోలుదారులకు చౌకగానే వాటాలను అందజేస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో ఐపీవోకు వచ్చిన రైల్వే సంస్థలు మొత్తం లిస్టింగ్‌ సమయంలో లాభాలను అందించాయి. దీంతో ఐఆర్‌ఎఫ్‌సీపై కూడా ఆశలు పెట్టుకొన్నారు.

ఇవీ చదవండి

మాకు దక్కిన అరుదైన గౌరవం: సుచిత్ర ఎల్ల

ఏవీ ఈవీ పరుగులు

 

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని