ఇంటర్నెట్‌డెస్క్: దేశీయ మర్కెట్ సూచీలు సోమవారం భారీగా పతనమయ్యాయి. ఊగిసలాట ధోరణిలో ఉదయం ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు.. సమయం గడిచేకొద్దీ నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 11.40 సమయంలో సెన్సెక్స్ 409 పాయింట్లు పతనమై 48,625 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు పతనమై 14,289 వద్ద ట్రేడవుతున్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎనర్జీ రంగాలు తప్ప మిగిలిన సూచీలు మొత్తం నష్టాల్లోనే ఉండటం విశేషం. న్యూలాండ్ లేబరేటరీ, ఇండియన్ ఎనర్జీ, టాటా ఎలిక్సీ, బజాజ్ హిందూస్థాన్ షుగర్స్, మజెస్కో షేర్లు లాభాల్లో ఉండగా.. రామ్‌కో ఇండస్ట్రీస్, మాస్టెక్, ఎంఎస్టీసీ, టాటా స్టీల్ లాంగ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
మార్కెట్లో విక్స్ సూచీ 3.7శాతం పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. ఆటో, మెటల్, ఫార్మా రంగాలకు చెందిన షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతోపాటు హెవీ వెయిట్ షేర్లు అయిన టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లలో లాభాల స్వీకరణ జరుగుతోంది. ఫలితంగా వాటి విలువ 1శాతానికి పైగా తగ్గింది. ఈ ప్రభావం సూచీలపై పడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు నమోదు చేయడంతో హాంకాంగ్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు మాత్రం నష్టాలను నమోదు చేస్తున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ 1.1శాతం, ద.కొరియా కోస్పి 0.7శాతం, ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్ఎక్స్ 0.8శాతం క్షీణించాయి. శుక్రవారం డోజోన్స్, నాస్‌డాక్‌లు నష్టపోవడంతో ఆ ప్రభావం వీటిపై పడింది.
ఇదీ చదవండి
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?